‘కనులు కనులను దోచాయంటే’ ట్రయిలర్ రిలీజ్

  • Written By:
  • Publish Date - February 19, 2020 / 12:50 PM IST

‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రీతూ వర్మ.. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే సినిమా హిట్ గా నిలిచింది కానీ ఈ అమ్మడికి తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో తమిళ .. మలయాళ సినిమా ఇండస్ట్రీలపై దృష్టిపెట్టింది.

ఈ నేపథ్యంలోనే మలయాళంలో దుల్కర్ కథానాయకుడిగా నటిస్తున్న‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌’ సినిమాలో నటిస్తోంది. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌కు ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈనెల 28న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటీకే ఈ సినిమా నుండి టీజర్, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రయిలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.