Kantara : OTT లో డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘కాంతారా’

Kantara : ప్రాంతీయ బాషా చిత్రంగా విడుదలై ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమాగా మారి బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన చిత్రం ‘కాంతారా’..కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఏకంగా KGF చాప్టర్ 2 మరియు బాహుబలి రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేసింది అంటే మాములు విషయం కాదు..ఇక తెలుగులో 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి హిందీ వంద కోట్ల రూపాయిల గ్రాస్ […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Kantara : OTT లో డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘కాంతారా’

Kantara : ప్రాంతీయ బాషా చిత్రంగా విడుదలై ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమాగా మారి బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన చిత్రం ‘కాంతారా’..కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఏకంగా KGF చాప్టర్ 2 మరియు బాహుబలి రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేసింది అంటే మాములు విషయం కాదు..ఇక తెలుగులో 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి హిందీ వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమాకి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..పెద్దగా పాపులారిటీ మరియు క్రేజ్ లేని హీరో సినిమా, కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం ఏమిటి..అసలు ఈ సినిమాలో అంత విషయం ఏముందో చూసేయాలని ఓటీటీ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసారు.

ఈమధ్యనే ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులు ఎగబడిమరీ చూసారు..కానీ చూసిన ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ‘ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఎలా అయ్యింది రా బాబు’ అనే వినిపిస్తుంది..మొదటి 15 నిమిషాలు మరియు చివరి 20 నిమిషాలు తప్ప అసలు సినిమాలో థ్రిల్లింగ్ పాయింట్ అనేదే లేదు..ఇలాంటి సినిమాని జనాలు అంతలా ఎగబడి ఎలా చూశారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..అలా థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ లో మాత్రం ప్రేక్షకుల నుండి డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాని అభిమానించే ప్రేక్షకులు చెప్పే మాట ఏమిటంటే..కొన్ని సినిమాలు థియేటర్స్ లో చూస్తూనే ఎక్కుతాయి..కాంతారా లాంటి చిత్రాలు కేవలం థియేట్రికల్ అనుభవం పొందేందుకే ప్రత్యేకంగా తీసిన సినిమాలు..అలాంటి సినిమాలను థియేటర్స్ లో చూస్తే వచ్చే అనుభవం టీవీ స్క్రీన్స్ లో చూస్తే రాదు అని చెప్తున్నారు.

Tags

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు