టీజర్ టాక్ : విషయం ఉన్నా విశేషం ‘కనబడుటలేదు’ !

కమెడియన్ సునీల్ హీరోగా సుక్రాంత్ వీరెల్ల మరో లీడింగ్ పాత్రలో రూపొందుతున్న సినిమా ‘కనబడుటలేదు’. టైటిల్ లోనే మ్యాటర్ ఏంటో చెప్పేసిన ఈ సినిమా టీజర్‌ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సాగిన ఈ టీజర్ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌, కొంత యాక్షన్ తో మొత్తానికి టీజర్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా సిటీలో వరుస […]

  • Written By: Raghava
  • Published On:
టీజర్ టాక్ : విషయం ఉన్నా విశేషం ‘కనబడుటలేదు’ !

Sunilకమెడియన్ సునీల్ హీరోగా సుక్రాంత్ వీరెల్ల మరో లీడింగ్ పాత్రలో రూపొందుతున్న సినిమా ‘కనబడుటలేదు’. టైటిల్ లోనే మ్యాటర్ ఏంటో చెప్పేసిన ఈ సినిమా టీజర్‌ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సాగిన ఈ టీజర్ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌, కొంత యాక్షన్ తో మొత్తానికి టీజర్ పర్వాలేదనిపించింది.

ముఖ్యంగా సిటీలో వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతూ.. కథనంలో అనేక మలుపులు ఉంటాయని ఈ టీజర్ ను చూస్తే అర్ధం అవుతుంది. అలాగే టీజర్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్‌ తో పాటు ఇంట్రెస్టింగ్ థింక్స్ కూడా ఉండటంతో ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ మధ్య కాలంలో హీరోగా సునీల్‌ కి డిమాండ్ తగ్గింది.

దానికితోడు సునీల్ హీరోగా చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కనీసం విజయాలు దక్కకపోయినా గౌరవప్రదమైన గుర్తింపు కూడా రాలేదు. కానీ సునీల్ మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ చిత్రంతో అయినా సునీల్ భారీ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇండస్ట్రీలో ఈ సినిమాకి వస్తోన్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఈ క్రైమ్ డ్రామాలో స్లో ప్లే ఉందని తెలుస్తోంది.

అలాగే నేర ప‌రిశోధ‌న చిత్రాలు ఎలా ఉంటాయో ఆ ఫార్మెట్ లోనే ఈ సినిమా ఉండబోతుందని.. సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదని తెలుస్తోంది. అయితే, టీజ‌ర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ మరియు స్టోరీ సెటప్ అండ్ పాత్రల గెటప్ కూడా బాగున్నాయి. కాక‌పోతే, మేకింగ్ లోనే క్వాలిటీ లేదు. కథలో పరిణితి కూడా లేదనిపిస్తోంది. పాత్రల సంఘర్షణలో కూడా బలం లేదు.

సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ – శ్రీ పాద క్రియేషన్స్ – షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే స్పార్క్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌ లో వస్తోన్న ఈ సినిమాకి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు