బస్సు బోల్తా..21మందికి తీవ్ర గాయాలు

కామారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుంది. ఈ ఘటన సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు బోల్తా పడి 5 కుటుంబాలకు చెందిన 21 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. పిల్లలను తీసుకుని అక్షరాబ్యాసం చేయించడానికి 5 కుటుంబాలు ఓ మినీ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. అయితే బస్సు వెనక టైర్ పేలి బోల్తాపడి అందరూ గాయలపాలయ్యారు. డ్రైవర్ తో సహా బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, […]

  • Written By: Neelambaram
  • Published On:
బస్సు బోల్తా..21మందికి  తీవ్ర గాయాలు


కామారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుంది. ఈ ఘటన సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు బోల్తా పడి 5 కుటుంబాలకు చెందిన 21 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు.

పిల్లలను తీసుకుని అక్షరాబ్యాసం చేయించడానికి 5 కుటుంబాలు ఓ మినీ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు. అయితే బస్సు వెనక టైర్ పేలి బోల్తాపడి అందరూ గాయలపాలయ్యారు. డ్రైవర్ తో సహా బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, 9 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు