kamal Haasan కులమే నాకు అతిపెద్ద రాజకీయ శత్రువు అంటున్న స్టార్ హీరో
kamal Haasan ఆయనకు కులం అంటే గిట్టదు. కులాన్ని కుళ్లుగా అభివర్ణిస్తారు. తన శత్రువు కులమే అని ప్రకటిస్తారు. దురాచారాలను, మూఢనమ్మకాలను నిలువునా కడిగిస్తారు. కులం కుళ్లు, మతం మత్తు .. ఆ మత్తులో యువత చిత్తు కావొద్దంటూ హితవు పలుకుతారు. అలా అని ఆయనో దళిత మేధావినో.. కవినో.. కథకుడో అనుకుంటే పొరబాటే. ఆయనో స్వచ్చమైన బ్రాహ్మణుడు. ఒంట్లోని అనువణువును నటింప చేయగల సత్తా ఉన్నోడు. కళామతల్లి ముద్దు బిడ్డగా పేరొందినోడు. ఇంతకీ ఆయనెవరు ? […]


kamal Haasan ఆయనకు కులం అంటే గిట్టదు. కులాన్ని కుళ్లుగా అభివర్ణిస్తారు. తన శత్రువు కులమే అని ప్రకటిస్తారు. దురాచారాలను, మూఢనమ్మకాలను నిలువునా కడిగిస్తారు. కులం కుళ్లు, మతం మత్తు .. ఆ మత్తులో యువత చిత్తు కావొద్దంటూ హితవు పలుకుతారు. అలా అని ఆయనో దళిత మేధావినో.. కవినో.. కథకుడో అనుకుంటే పొరబాటే. ఆయనో స్వచ్చమైన బ్రాహ్మణుడు. ఒంట్లోని అనువణువును నటింప చేయగల సత్తా ఉన్నోడు. కళామతల్లి ముద్దు బిడ్డగా పేరొందినోడు. ఇంతకీ ఆయనెవరు ? కులం అంటే ఆయనకెందుకు గిట్టదు ? స‌్టోరీలో చదివేయండి.
కమల్ హాసన్.. భారత సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న అసమాన నటుడని చెప్పవచ్చు. ఉగ్గుపాలతోనే నటనలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. నటనతో పాటు రాజకీయాలను అవపోసన పట్టాడు. ద్రవిడ సిద్ధాంతాలను అణువనువు జీర్ణించుకున్న ద్రావిడోద్యమ నేతగా ఎదిగారు. నటనను, రాజకీయాలను జీవితంలో రెండు పార్వ్శాలుగా మార్చుకున్నాడు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాడు. ఓడిపోయాడు. కానీ రాజకీయాల్ని విడవలేదు. తన సిద్ధాంతాల కోసం పోరాడుతున్నాడు.
కమల్ హాసన్ ఇటీవల కులం పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు అతిపెద్ద రాజకీయ శత్రువు కులమే అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇదే చెబుతున్నానని అన్నారు. ఇప్పటికీ తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. మనిషి సృష్టించుకున్న కులమే మనిషి పై దాడి చేస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. 21 ఏళ్లకే కులం పై అంత లోతైన అవగాహన ఉందంటే కమల్ హాసన్ రాజకీయ పరిణితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కమల్ స్వతహాగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడే ద్రావిడ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి తను నమ్మిన బాటలోనే నడుస్తున్నారు.
ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. కులాన్ని త్యజించడం అంటే సామాన్య విషయం కాదు. కులాన్ని త్యజించడమే కాకుండా ఆ కులం వల్ల జరుగుతున్న దారుణాలను ఎండగట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ కులానికి వ్యతిరేకమైన రాజకీయ సిద్ధాంతాన్ని నెత్తిన మోయడం.. ఆయన రాజకీయ, సామాజిక పరిణతికి అద్దం పడుతుంది. ఓ నటుడిగా కొనసాగుతూనే సామాజిక, రాజకీయాంశాల పై కమల్ హాసన్ చేస్తున్న పోరాటం అసమానమైనది . అసాధారణమైనది. కమల్ రీల్ హీరోనే కాదు. రియల్ హీరో అని ఒప్పుకోవాలి.
