Kamal Haasan- Balakrishna: సుమారు నాలుగు దశాబ్దాల నుండి మాస్ హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బాలయ్య బాబు ఆరు పదుల వయస్సులోకి వచ్చిన కొత్తల్లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని మార్కెట్ మొత్తాన్ని కోల్పోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక కెరీర్ దాదాపుగా క్లోజ్ అని అనుకుంటున్న సమయం లో బోయపాటి శ్రీను రూపం లో అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు ని అందుకొని తన మార్కెట్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు బాలయ్య బాబు.

Kamal Haasan- Balakrishna
కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు..తన తదుపరి చిత్రాల లైనప్ ని కూడా క్రేజీ స్టార్ డైరెక్టర్స్ తో సెట్ చేసుకున్నాడు..ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం చేస్తున్న బాలయ్య బాబు, ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల రూపాయలకు పలుకుతుంది..అఖండ సినిమా తర్వాత బాలయ్య మార్కెట్ నాలుగింతలు పెరిగిపోయింది..కెరీర్ ఎండింగ్ స్టేజి లో ఈ రేంజ్ పీక్ ని ప్రస్తుతం టాలీవుడ్ లో బాలయ్య బాబు తప్ప ఎవ్వరు ఇవ్వడం లేదు.
ఇక్కడ బాలయ్య బాబు ఎలా అయితే అభిమానులకు కిక్ ని ఇస్తున్నాడో తమిళనాట కమల్ హాసన్ కూడా అదే రేంజ్ స్టార్ స్టేటస్ ని కొనసాగిస్తున్నాడు..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకునే స్థాయికి పడిపోయిన కమల్ హాసన్, లేటెస్ట్ గా విక్రమ్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టాడో మన కళ్లారా చూసాము..సుమారు 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యింది.

Kamal Haasan- Balakrishna
ఇక ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ శంకర్ తో ఇండియన్ 2 తీస్తున్నాడు..ఈ ప్రాజెక్ట్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..ఈ సినిమా తర్వాత లేటెస్ట్ గా ఆయన మణిరత్నం తో ఒక సినిమా తియ్యబోతున్నట్టు అధికారికంగా కమల్ హాసన్ పుట్టినరోజునాడు తెలిపారు..ఇలా వరుసగా ఇండియాని షేక్ చేసే సినిమాలతో కమల్ హాసన్ ఆయన అభిమానులకు పూనకాలు రప్పిస్తున్నాడు..ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత విక్రమ్ పార్ట్ 2 కూడా ఉంది..ఇలా బాలయ్య బాబు మరియు కమల్ హాసన్ కెరీర్ ముగుస్తున్న సమయం లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అభిమానులను ఆనందపరుస్తున్నారు.