Prabhas Project K: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ లో విలన్ గా కమల్ హాసన్..రెమ్యూనరేషన్ ప్రభాస్ కంటే ఎక్కువనా!
ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాని , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Prabhas Project K- Kamal Haasan: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదని, విడుదలైన తర్వాత ఆడియన్స్ కి ఇంతకు ముందు ఎప్పుడూ కలుగని థియేట్రికల్ అనుభూతి ఈ చిత్రం ద్వారా కలుగుతుందని మేకర్స్ ఇది వరకే పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాని , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా దీపికా పడుకొనే నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. అదేమిటంటే ఈ చిత్రం లో విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడట. ఇందుకోసం ఆయన 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం. బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్నీ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇందులో నిజం ఎంతో ఉందో తెలియాల్సి ఉంది. కమల్ హాసన్ ప్రస్తుతం హీరో గా పీక్ స్థానం లో ఉన్నాడు.
ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’ సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ చిత్రం తర్వాత ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘ఇండియన్ 2 ‘అనే చిత్రం చేస్తున్నాడు. కెరీర్ ఈ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ఆయన నెగటివ్ రోల్ నిజంగానే ఒప్పుకున్నాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
