Bimbisara Twitter Review: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే?

Bimbisara Twitter Review: మేనత్త చనిపోయిన బాధలో ప్రమోషన్స్ వీక్ అయిపోయినా సరే కళ్యాణ్ రామ్ మూవీ ఈరోజు అన్న సమయానికి రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత నటించిన చారిత్రక చిత్రం ‘బింబిసార’.కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికీష్ణ నిర్మించారు. కొత్త దర్శకుడు ‘వశిష్ట్’ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో టైమ్ ట్రావెల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా భారీ అంచనాల […]

  • Written By: Naresh
  • Published On:
Bimbisara Twitter Review: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ ఎలా ఉందంటే?

Bimbisara Twitter Review: మేనత్త చనిపోయిన బాధలో ప్రమోషన్స్ వీక్ అయిపోయినా సరే కళ్యాణ్ రామ్ మూవీ ఈరోజు అన్న సమయానికి రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత నటించిన చారిత్రక చిత్రం ‘బింబిసార’.కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికీష్ణ నిర్మించారు. కొత్త దర్శకుడు ‘వశిష్ట్’ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో టైమ్ ట్రావెల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ఆగస్టు 5న విడుదలైంది. మరి ఈ సినిమా మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు సినిమాపై అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు.. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Bimbisara Twitter Review

kalyan ram

సినిమా కథ ఇప్పటిదాకా.. బింబిసారుడు పాలించిన క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం నాటిది. త్రిగర్తల సామ్రాజ్యం నిధి చుట్టూ కథ తిరుగుతుంది. ఆ సామ్రాజ్యానికి రాజు ‘బింబిసారుడు’. ఈ పాత్రలో కళ్యాణ్ అద్భుతంగా నటించాడని ప్రేక్షకులు అంటున్నారు. తన సామ్రాజ్య నిధిని కలియుగంలో ఎలా కాపాడుకున్నారన్నది చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారని అంటున్నారు.

ఇక విజువల్ వండర్ అయిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని.. విజువ్ వండర్ అని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.

సోదరుడు ఎన్టీఆర్ చెప్పినట్టే అన్న కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టుగా ఈ సినిమాలో నటించారని ప్రేక్షకులు అంటున్నారు. వన్ మ్యాన్ షోగా అభివర్ణిస్తున్నారు. ఎంతో నిబద్ధతతో నటించాడని.. మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని ట్విట్టర్ లో ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కథ బాగా ఉందని.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉందని పోస్టులు పెడుతున్నారు. కళ్యాణ్ రామ్ మూవీకి చాలా మంది ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు.

ఇక కొంతమంది మూవీ క్రిటిక్స్ మాత్రం బింబిసార యావరేజ్ గా ఉందని అభిప్రాయపడుతున్నారు. పాత బింబిసారకు, నవతరం బింబిసారకు మ్యాచ్ కాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా పాజిటివ్ టాక్ సినిమాకు బయటకు వచ్చింది.

Also Read: Comedian Raghu Father Passed Away: విషాదం : ప్రముఖ హాస్యనటుడికి పితృవియోగం.. విషాదంలో కమెడియన్

Tags

    follow us