Kalvakuntla Kavitha : ‘భారత్ జాగృతి’ పేరుతో కోట్లు వసూలు.. బీఆర్ఎస్ ఏర్పాటు కవితకు ముందే తెలుసా?

Kalvakuntla Kavitha :  తెలంగాణ ఏర్పాటు తర్వాత కవిత ఆధ్వర్యంలో నడిచే జాగృతి అంత చైతన్య శీలంగా ఏమీ లేదు.. ఈ సంస్థ ఇక మరుగున పడిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ తరచి చూస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఎంపీ అరవింద్ ఆరోపించినట్టు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ అనేది రూఢీ అవుతున్నది.. గతంలో కవిత ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జాగృతికి అనుబంధంగా భారత్ జాగృతి ఫౌండేషన్ ఏర్పాటయింది.. అది కూడా ఏడు సంవత్సరాల […]

Kalvakuntla Kavitha : ‘భారత్ జాగృతి’ పేరుతో కోట్లు వసూలు.. బీఆర్ఎస్ ఏర్పాటు కవితకు ముందే తెలుసా?

Kalvakuntla Kavitha :  తెలంగాణ ఏర్పాటు తర్వాత కవిత ఆధ్వర్యంలో నడిచే జాగృతి అంత చైతన్య శీలంగా ఏమీ లేదు.. ఈ సంస్థ ఇక మరుగున పడిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ తరచి చూస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఎంపీ అరవింద్ ఆరోపించినట్టు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ అనేది రూఢీ అవుతున్నది.. గతంలో కవిత ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జాగృతికి అనుబంధంగా భారత్ జాగృతి ఫౌండేషన్ ఏర్పాటయింది.. అది కూడా ఏడు సంవత్సరాల క్రితం.. ఇందులో కవితకు 90%, ఆమె భర్త అనిల్ కు 10 శాతం షేర్లు ఉన్నాయి.. 2019లో ఈ సంస్థకు 1.92 కోట్ల విరాళాలు వచ్చాయి.. ఆ సంవత్సరం ఖర్చులు మొత్తం పోను 1.59 కోట్లు మిగిలాయి. అయితే ఇదే సమయంలో 2020లో ఒకేసారి 1.36 కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ సంవత్సరం ఆదాయం కేవలం 5. 80 లక్షలు రావడం గమనార్హం.

 

లక్ష పెట్టుబడితో ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారకముందే కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆవిర్భవించగా.. భారత్ జాగృతి పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసింది.. ఈ సంస్థలో ఏడేళ్ల క్రితం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. నాలుగో సంవత్సరం దాదాపు రెండు కోట్లు విరాళాలుగా వచ్చాయి.. అయితే మరుసటి సంవత్సరమే 1.36 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ జాగృతి అనుకూలంగా పనిచేసింది.. తెలంగాణలో అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ అప్పట్లో అనుకున్నారు. అప్పటికి పార్టీ ఏర్పాటు ప్రకటించకపోయినప్పటికీ… జాతీయస్థాయిలో ఆ పార్టీకి అనుబంధంగా పనిచేయాలని కవిత భారత్ జాగృతి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 2015 నవంబర్.. అంటే సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం జాగృతి అనే ఎన్జీవో సంస్థకు అదనంగా భారత్ జాగృతి ఫౌండేషన్ పేరుతో కల్వకుంట్ల కవిత ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శ్రీకారం చుట్టారు.. తెలంగాణ జాగృతి పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఉనికిలోకి వస్తే.. భారత్ జాగృతి ఫౌండేషన్ మాత్రం వివిధ వివిధ రకాల చారిటీ సర్వీసులను అందించే లక్ష్యంతో తెరపైకి వచ్చింది కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ డైరెక్టర్లుగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు.. అయితే ఇటీవల కవిత ఢిల్లీ వెళ్లారు.. అక్కడ జరిగిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజాన్ని జాగృత పరుస్తున్న కవులను, కళాకారులను భారత్ జాగృతి, ఇండియా టుడే ఆధ్వర్యంలో వచ్చే ఏడాది నుంచి సన్మానిస్తామని చెప్పారు. ఎప్పుడైతే ఆమె ఆ విషయం చెప్పారో… అప్పుడే ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి భారత్ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ… తెలంగాణ సమాజంలో పెద్దగా కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు.. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి సంస్థల ఏర్పాటు ఉద్దేశం వేరువేరు అయినప్పటికీ… నిర్వాహకులు భార్యాభర్తలు కావడం విశేషం..
కోట్లలోకి ఎలా వెళ్ళింది
భరత్ జాగృతి ఫౌండేషన్ పేరుతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేవలం 1, క్యాపిటల్ షేర్ తో 2015 నవంబర్లో ఏర్పాటు అయింది.. కల్వకుంట్ల కవిత 90% షేర్లతో, ఆమె భర్త అనిల్ 10 శాతం షేర్లతో ఇద్దరే డైరెక్టర్లుగా హైదరాబాదులోని దోమలు కూడా అడ్రస్ తో రిజిస్టర్ చేశారు. ఒక్కో షేర్ విలువ పది రూపాయలుగా ఫిక్స్ చేయడంతో కవిత షేర్ 90,000, అనీల్ షేర్ 10,000 గా ఉన్నది. దోమలగూడలోని పాశం అమృతరామ్ రెసిడెన్సి లో ఫ్లాట్ నంబర్ 31 నుంచి నడిచే ఈ ఫౌండేషన్ నెలకు 40 వేల అద్దె చొప్పున లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. పెద్దగా చారిటీ సేవలు ఏవీ నిర్వహించకపోయినప్పటికీ 2019లో ఒక్కసారిగా 1.92 కోట్ల మేర విరాళాలు అందాయి.. తింటూ 2019 మార్చి చివరినాటికి కంపెనీ ఖర్చులు మొత్తం పోగా 1.5 9 కోట్లు ఆస్తులను నమోదు చేసింది.. అయితే మరుసటి సంవత్సరం 5.80 లక్షలు మాత్రమే డొనేషన్లు వచ్చాయి. మాత్రం ఒక్కసారిగా 1.36 కోట్ల మేర ఖర్చు చూపించడంతో ఆ ఏడాది మార్చి చివరి నాటికి 1.33 కోట్ల నష్టంతో నడుస్తున్నట్టు ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ల ద్వారా వెల్లడి అయింది.. చివరికి 50.08 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నట్టు కంపెనీ పేర్కొన్నది.. కొత్తలో బుచ్చిబాబు భారత్ జాగృతి ఫౌండేషన్ లో కొనసాగుతున్నారు. లిక్కర్ స్కామ్ లో విచారణ నిమిత్తం ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఇక ఈ ఫౌండేషన్ అద్దెకు తీసుకున్న దోమలగూడలోని పాశం అమృత రామ్ బిల్డింగ్ లోని ఫ్లాట్ నెంబర్ 301 లో రాజీవ్ సాగర్ పేరుతో లీజు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈయన మరెవరో కాదు. సుదీర్ఘకాలం కవితకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాజీవ్ సాగర్ ప్రస్తుతం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న నేపథ్యంలో తెరపైకి భారత్ జాగృతి ఫౌండేషన్ వివరాలు రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు