Kajal Aggarwal: భర్తతో రొమాంటిక్ ట్రిప్… షూటింగ్ బ్రేక్ లో అలా ఎంజాయ్ చేస్తున్న కాజల్!
కాగా బిజీ లైఫ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చిన విహారానికి చెక్కేసింది. ప్రస్తుతం కాజల్ టర్కీ దేశంలో ఉన్నారు. అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. భర్త గౌతమ్ కిచ్లుతో ఉన్న రొమాంటిక్ ఫోజ్ షేర్ చేశారు. ఫ్యాన్స్ ఈ లవ్లీ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. గౌతమ్ తో కాజల్ కి చాలా కాలంగా పరిచయం ఉంది. అతను ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. పెళ్ళైన వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు.

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. రెండు భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల స్టార్ట్ అయ్యింది. కమల్ హాసన్ హీరోగా విడుదలైన విక్రమ్ భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో భారతీయుడు 2 మేకర్స్ దర్శకుడు శంకర్ తో కాంప్రమైజ్ అయ్యారు. దీంతో శంకర్ శరవేగంగా భారతీయుడు 2 పూర్తి చేస్తున్నారు. ఇంకా 20 రోజుల షూటింగ్ ఉందని సమాచారం. కెరీర్లో ఫస్ట్ టైం కాజల్ కమల్ హాసన్ తో జతకడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రం చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. శ్రీలీల కీలక రోల్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తుండగా భగవంత్ కేసరి చిత్రంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడని భావిస్తున్నారు.
కాగా బిజీ లైఫ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చిన విహారానికి చెక్కేసింది. ప్రస్తుతం కాజల్ టర్కీ దేశంలో ఉన్నారు. అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. భర్త గౌతమ్ కిచ్లుతో ఉన్న రొమాంటిక్ ఫోజ్ షేర్ చేశారు. ఫ్యాన్స్ ఈ లవ్లీ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. గౌతమ్ తో కాజల్ కి చాలా కాలంగా పరిచయం ఉంది. అతను ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. పెళ్ళైన వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు.
గత ఏడాది ఏప్రిల్ లో కాజల్ కి పండంటి బాబు పుట్టాడు. కాజల్ కొడుకు పేరు నీల్ కిచ్లు. కాజల్ అగర్వాల్ కి దర్శకుడు రాజమౌళి బ్రేక్ ఇచ్చాడు. మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర చాలా ఫేమస్. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. ఇటీవల కాజల్ బాలీవుడ్ పై విమర్శలు చేయడం విశేషం. బాలీవుడ్ లో విలువలు లేవంటూ మండిపడ్డారు. అదే సమయంలో సౌత్ పరిశ్రమను పొగిడారు.
View this post on Instagram