Kajal Aggarwal Son: కాజల్ అగర్వాల్ కొడుకు క్రేజ్ మామూలుగా లేదుగా..విమానాశ్రయం దద్దరిల్లింది!
Kajal Aggarwal Son: సౌత్ ఇండియా లో సుమారుగా దశాబ్దం పై నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. చందమామ అనే సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు లో టాప్ 6 హీరోలందరితో […]


Kajal Aggarwal Son
Kajal Aggarwal Son: సౌత్ ఇండియా లో సుమారుగా దశాబ్దం పై నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. చందమామ అనే సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు లో టాప్ 6 హీరోలందరితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఈమె మాత్రమే.
ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా నటించేస్తూ అందరినీ కవర్ చేసేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తో ఇప్పటికే ఒక సినిమా చేసిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య తో కూడా చేయబోతుంది. కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళ్ , హిందీ లో కూడా ఈమె దాదాపుగా అందరితో కలిసి నటించింది. పెళ్లి తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె విమానాశ్రయం లో తన కొడుకు తో కలిసి కార్ ఎక్కుతున్న వీడియో వైరల్ గా మారింది. క్యూట్ గా అమాయకంగా చూస్తున్న కాజల్ కొడుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇక విమానాశ్రయం లో ఉన్నంత సేపు అభిమానులు కాజల్ అగర్వాల్ వెంట పడడం ప్రారంభించారు. ఇది వరకు కాజల్ అగర్వాల్ తో ఫోటోలు దిగడానికి ఎగబడేవారు అభిమానులు.

Kajal Aggarwal Son
కానీ ఇప్పుడు కాజల్ కొడుకుని చూసేదుకు ఎగబడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఈ బుడ్డోడు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.అయితే కాజల్ అగర్వాల్ మాత్రం రీసెంట్ గా అభిమానులతో జరిగిన లైవ్ ఇంటరాక్షన్ లో తన కొడుక్కి 8 ఏళ్ళు వచ్చే వరకు సినిమాల్లోకి తీసుకొని రానని చెప్పుకొచ్చింది.