Kajal Aggarwal Remuneration: కాజల్ అగర్వాల్ డిమాండ్ ఈ రేంజ్ లో పడిపోయిందా.. ఒక్కో సినిమాకి ఇప్పుడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా!
చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కాజల్ అగర్వాల్ కి రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత కాజల్ అగర్వాల్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయి చేరుకుంది.

Kajal Aggarwal Remuneration: టాలీవుడ్ లో ఏడాదికి ఎంతో మంది హీరోయిన్స్ రావొచ్చు, పోవచ్చు కానీ కొంత మంది హీరోయిన్స్ క్రేజ్ మాత్రం ఎప్పటికీ తరగిపోదు. ఎందుకంటే వాళ్ళ అందం తో గతం లో కుర్రకారుల మనసులతో కబడ్డీ ఆడేసుకున్నారు. అలాంటి స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘లక్ష్మి కళ్యాణం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా కాజల్ అగర్వాల్, ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చందమామ’ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు ని దక్కించుకుంది.
అలా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కాజల్ అగర్వాల్ కి రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత కాజల్ అగర్వాల్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయి చేరుకుంది.
ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్ మరియు రామ్ చరణ్ ఇలా అందరి హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకుంది. అలా నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ కి అప్పట్లో రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చేవారట. కానీ పెళ్లి తర్వాత ఆమెకి ఇప్ప్పుడు ఒక్కో సినిమాకి 50 నుండి 75 లక్షల రూపాయిలు మాత్రమే తీసుకుంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.
ఆమెకి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్న నిర్మాతలు కాజల్ అగర్వాల్ కి కేవలం 70 లక్షల రూపాయిలు మాత్రమే ఇస్తున్నారట. తనకంటే జూనియర్ అయినా శ్రీలీల కి అంత డబ్బులిచ్చి, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్ కి అంత తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం ఏమిటి అని అభిమానులు మేకర్స్ పై విరుచుకుపడుతున్నారు.
