MP Avinash Reddy : అవినాష్ రెడ్డి ఊపిరిపీల్చుకో..
చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు.సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ చేయాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.

MP Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం వరకూ ఆయనపై ఎటువంటి చర్యలు వద్దని న్యాయస్థానం సీబీఐకి ఆదేశించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదులతో పాటు సీబీఐ, అటు సునీత తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ కోర్టు మాత్రం ఈ నెల 31 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సీబీఐ తరుపు న్యాయవాదులు గట్టి వాదనలే వినిపించారు. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని.. ఇప్పటికే మూడుసార్లు గైర్హాజరైన విషయాన్ని ప్రస్తావించింది. వీలైనంతవరకూ పిటీషన్లు, వాయిదాలు కోరుతున్న విషయాన్ని గుర్తుచేసింది. విచారణకు సహకరించడం లేదు. నోటీసులు ఇచ్చినా రావడం లేదు. కర్నూలులో రౌడీ మూకల్ని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయడానికి అడ్డంకులు కల్పించారు. కర్నూలులో ఎస్పీ సహకారం కోరినా కుదర్లేదు. ఆయన చాలా ప్రభావితమైన వ్యక్తి. సీబీఐ అధికారును అడ్డుకోవడానికి చాలా చేశారు. అంటూ సీబీఐ తన వాదనలు వినిపించినా ఫలితం లేకపోయింది.
అయితే అవినాష్ రెడ్డి చాలాకాలంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. సీబీఐ దూకుడుగా వ్యవహరించడం, ఇప్పటికే తన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేయడంతో జాగ్రత్త పడ్డారు. ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. గతంలో హైకోర్టులో వాదనలు జరిగాయి. కానీ న్యాయమూర్తి తీర్పు ఇవ్వలేదు. వేసవి సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని చెప్పారు. ఈ లోపు విచారణకు సీబీఐ నోటీసులు ఇస్తే.. అరెస్ట్ చేస్తారేమో అని ఆయన విచారణకు వెళ్లలేదు. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు.సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ చేయాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.
అవినాష్ రెడ్డి కోరుకున్నట్టే ఇప్పుడు నాలుగు రోజుల వ్యవధి దొరికింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. కోర్టులు కూడా ఆయనతో ఫుట్ బాల్ ఆడుకున్నాయి. కానీ కేసు విచారణనుఎంత ఆలస్యం చేయాలో అంత ఆలస్యం చేయగలిగారు. అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. కానీ సునీ త పట్టు వీడ కుండా సుప్రీంకోర్టుకు వెళ్లి ఊరటల్ని కొనసాగకుండా చేస్తున్నారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇస్తున్న తీర్పుల్ని చూసి రెండు సార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి బుధవారం ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.