
Kabza Collection
Kabza Collection: కన్నడ చలన చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ చిత్రం ‘కబ్జా’.ఉపేంద్ర హీరో గా నటించిన ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు.టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.KGF సినిమాని చెత్తగా తీస్తే ఎలా ఉంటుందో, అలా ఈ ‘కబ్జా’ సినిమా ఉంది అంటూ తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
అయితే భారీ బడ్జెట్ సినిమా కావడం తో మొదటి రోజు వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి.వీకెండ్ వరకు కూడా ఇదే ఫ్లో కొనసాగే అవకాశం కూడా ఉంది, కానీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అది ఏమాత్రం కూడా సరిపోదు అనే చెప్పాలి.మొత్తం మీద అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.
ఉపేంద్ర కి మన తెలుగు లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది, ఆయన క్రేజ్ కారణంగా సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి.అందుతున్న ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.

Kabza Collection
ఇక కర్ణాటక లో ఈ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల 50 లక్షలు వచ్చాయని, అలాగే హిందీ, తమిళం భాషలు కలిపి మరో రెండు కోట్ల రూపాయిలు గ్రాస్ వచ్చిందని, అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిందని చెప్తున్నారు.కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రానికి మొదటి రోజు 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేవని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.