Shri Reddy: యాంకర్ నుంచి నటిగా మారిన శ్రీరెడ్డికి టాలీవుడ్లో వివాదాస్పద నటిగా గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటూ సినిమా ఇష్యూలతోపాటు వర్తమాన అంశాలపై తనదైన శైలిలో శ్రీరెడ్డి కౌంటర్, ఎన్ కౌంటర్ చేస్తుంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనను ఎవరైనా విమర్శిస్తూ ఒంటికాలిపై లేస్తుంటారు.

Shri Reddy
అయితే శ్రీరెడ్డికి టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో కొద్దిరోజులపాటు చెన్నైలో ఉన్నారు. పలు తమిళ సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నించారు. మళ్లీ ఏమైందో ఏమో తెలియదుగానీ తాజాగా మూవీ ప్రొడ్సూసర్ కౌన్సిల్లో ఇటీవలే మెంబర్ తీసుకున్నారు. సీఎం జగన్ తరుపున వకల్తా పుచ్చుకొని ఇండస్ట్రీని కొద్దిరోజులుగా ఏకిపారేస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. జ్వరం, జలుబు వంటి స్వల్పలక్షణాలు ఉండటంతో కోవిడ్ టెస్టు చేయించుకోవగా కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు మహేష్ బాబు హోం ఐసోలేషన్లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని మహేష్ బాబు ట్వీటర్లో ట్వీట్ చేశారు.
మహేష్ బాబుకు కరోనా సోకడంతో ఆయన ఫ్యాన్స్ తోపాటు యావత్ ఇండస్ట్రీ ఆందోళనకు గురవుతోంది. ఈనేపథ్యంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, తోటి హీరోలు హీరోయిన్లు ట్వీట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ పై తన ప్రేమను చాటుకుంటూ ‘నువ్వు త్వరగా కోలుకోవాలి మహేశ్ అన్నా.. నీకోసం ధైర్యాన్ని.. నా ప్రార్థనలను పంపుతున్నా’ అంటూ ట్వీట్ చేయడం ఆకట్టుకుంది.
మహేష్ ఆరోగ్యంపై శ్రీరెడ్డి రోటిన్ కు భిన్నంగా స్పందించారు. ఆమె తన ట్వీటర్లో ‘మీరు త్వరగా కోలుకోవాలి సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు.. జాగ్రత్తగా ఉండండి అన్నయ్య..’ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమె మహేష్ అన్నయ్య అని సంబోధించడమే అందరినీ షాక్ కు గురిచేస్తోంది. సినిమా హీరోలను ఓరేంజులో ఆడుకునే శ్రీరెడ్డి మహేష్ ను మాత్రం అన్నయ్య అనడం నిజంగా గొప్పవిషమేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.