NTR Licious Ad: ‘చాప చిన్నదైనా ఎర పెద్దది వేయాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత జూనియర్ సినిమాలు చేయకపోయినా కమర్షియల్ యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వీటి కోసం ఇటీవల ఆయన గెటప్ లు కూడా మార్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో వచ్చి సందడి చేశాయి. తాజాగా ఓ యాడ్ కు సంబంధించిన వీడియో ఫుల్ పాపులారిటీ సాధించింది. ఇందులో జూనియర్ తో పాటు రాహుల్ రామకృష్ణ కూడా నటించారు. ఆ యాడ్ ఎలా ఉందంటే..?

NTR Licious Ad
సినిమాల్లో హీరోగా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా కొన్ని ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన టీవీ హీరో కూడా అయిపోయారు. అయితే బుల్లితెర ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు ఆయనతో యాడ్ షూటింగ్ నిర్వహిస్తున్నాయి. జూనియర్ తో యాడ్ చేయించిన కంపెనీలు పాపులారిటీ సాధించాయని ఫ్యాన్స్ చెప్పుకుంటారు. ఇదే కోవలో తాజాగా ‘హబ్ లిసియస్ ఫుడ్స్’ అనే యాప్ కు అడ్వర్టైజ్ చేస్తున్నాడు.
యాడ్ కు సంబంధించిన కోర్టు లో ఉంటుంది. రాహుల్ రామకృష్ణ ఇందులో డైరెక్టర్ గా కనిపిస్తాడు. బోనులో ఉన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి నాలుగు లైన్ల డైలాగ్ చెప్పమంటాడు. కానీ ఆ డైలాగ్ చెప్పలేక పోయారు. దీంతో రాహుల్ రామకృష్ణ ‘ఆరపేజీల డైలాగైనా అర సెకన్ లో చెబుతారు.. ఇంత చిన్న డైలాగ్ చెప్పలేరా..? అని అంటారు. దీంతో వెంటనే ఎన్టీఆర్ ‘చాప చిన్నదైనా ఎర పెద్దది వేయాలి’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

NTR Licious Ad
ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇది డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ గ్యాప్ లో టైం వేస్ట్ చేయకుండా అవకాశం వచ్చిన యాడ్స్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. మిగతా వాటికంటే ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది టెంపర్ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కు అనుకరణ అని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.