Junior NTR New Look: సినీ స్టార్ గురించి ఏ న్యూస్ అయినా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలు ఎప్పుడు..? ఎక్కడ..? ఏం చేస్తున్నారోనని ఫాలో అవుతూ ఉంటారు. అందులోనూ మన తెలుగు హీరోలకు వీరాభిమానులు ఎక్కువే ఉన్నారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో ఆయన ఎటు వెళ్లినా ఫ్యాన్స్ చుట్టుముడుతున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఆయన ప్రొఫైల్ నూ ఫాలో చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఓ లెటేస్ట్ పిక్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో ఊహించని లుక్ లో కనిపిస్తూ ఆకర్షిస్తున్నాడు.

Junior NTR New Look
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత జూనియర్ కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. డిసెంబర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ఈ యంగ్ టైగర్ పలు యాడ్స్ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఇటీవల బాద్ షా లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో లుక్ తో ఇంప్రెస్ చేస్తున్నాడు. స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకునే హీరోల్లో జూనియర్ ఒకరు. నిత్యం రిచెస్ట్ ఐటమ్స్ ధరిస్తూ ప్రత్యేకంగా నిలుస్తారు. ఇప్పుడు కూడా ఆయన కాస్ట్లీ లుక్ లో కనిపిస్తూ మతి పొగొట్టేస్తున్నాడు.
మరోసారి కళ్లజోడుతో ప్రత్యక్షమైన జూనియర్ బ్లాక్ బ్లేజర్ ధరించాడు. ఒక వైపు సీరియస్ గా లుక్ పెట్టడంతో అందరూ ఇది సినిమా షూటింగ్ ఫోజు అని అనుకుంటున్నారు. కానీ ఓ బ్రాండ్ ను అడ్డర్టయిజ్మెంట్ చేయడానికి ఈ లుక్ ఇచ్చాడని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ మాస్ లుక్ లోనే ఊహించుకుంటున్నారు. కానీ సడెన్లీగా రిచెస్ట్ క్లాస్ లుక్ తో కనిపించి అదరగొడుతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది.

Junior NTR New Look
ఎన్టీఆర్ సొంతంగా వాడే వస్తువులు కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఆయన వాచ్ ధర రూ.3 కోట్లు అని టాక్. అలాగే బ్లేజర్, షూస్, అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నవే. ఇక ఆయన కార్లు కూడా చాలా కాస్ట్లీవే అని అంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయనతో పాన్ ఇండియా మూవీకే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఇందుకోసం ఇప్పటికే కథను రచించాడు. అయితే కొన్ని మార్పులతో ఆ మూవీ కాస్త ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.