
Anchor Suma- Junior NTR
Anchor Suma- Junior NTR: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమకు చేదు అనుభవం ఎదురైంది. హీరో ఎన్టీఆర్ ఆమె మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అల్లరితో చిర్రెత్తిపోయి ఉన్న ఎన్టీఆర్ ని సుమ కామెంట్స్ మరింత ఆగ్రహానికి గురి చేశాయి. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అమిగోస్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఎన్టీఆర్ 30 అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదనే అసహనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉంది.
తమ అసహనాన్ని అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రదర్శించారు. ఎన్టీఆర్ వచ్చినప్పటి నుండి నాన్ స్టాప్ గా ఎన్టీఆర్ 30 అప్డేట్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ తీరుకు ఎన్టీఆర్ ఆవేశానికి గురయ్యారు. అభిమానులు కాబట్టి ఏమీ అనలేం, సహనం కోల్పోయి కోపం ప్రదర్శించే పెద్ద న్యూస్ అవుతుంది. తన అసహనాన్ని ఎన్టీఆర్ మనసులో చాలా వరకు కప్పి పెట్టి ఉంచాడు.
వేడుక చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్ మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. సుమ ఎన్టీఆర్ కి మైక్ అందిస్తూ… ఆయన ఎన్టీఆర్ 30 అప్డేట్ ఇస్తారంటూ కామెంట్ చేసింది. యాంకర్ సుమ తన తరపున ఫ్యాన్స్ కి హామీ ఇవ్వడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. ఆయన ముఖ కవళికలు మారిపోయాయి. ఈమె ఇలా ఇరికించేసిందేంటి అన్నట్లు చూశాడు. చివరకు బరస్ట్ అయ్యాడు కూడాను. ”వాళ్ళు అడగక ముందే మీరు చెప్పేస్తున్నారు” అని సుమను చూస్తూ మైక్ లో అన్నారు. సుమ కామెంట్స్ ఎన్టీఆర్ కి ఎంత కోపం తెప్పించాయో ఆయన బాడీ లాంగ్వేజ్ తో అర్థమైంది.

Junior NTR
నిజానికి సుమతో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. రాజీవ్ కనకాల ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్. రాజీవ్ కనకాల భార్యగా ఎన్టీఆర్ కి ఆమె చాలా క్లోజ్. సుమపై ఎన్టీఆర్ అసహనం ప్రదర్శించడానికి ఫ్యాన్స్ కారణమయ్యారు. వారి అల్లరితో విసిగిపోయి ఉన్న ఆయన ఆ కోపాన్ని సుమ మీద చూపించారు. ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. మరింత నాణ్యమైన సినిమాలు తెరకెక్కించాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఆలస్యం అవుతాయి. ముఖ్యమైన విషయం ఉంటే భార్య కంటే కూడా ముందు మీకే చెప్తాము. ఏ హీరో ఫ్యాన్స్ అయినప్పటికీ అప్డేట్స్ అంటూ మేకర్స్ మీద ఒత్తిడి తేకండని అర్థమయ్యేలా చెప్పాడు.
— (@BheeshmaTalks) February 5, 2023