
Junior NTR- Politics
Junior NTR- Politics: రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం గా ఉన్నా, రాజకీయాలు ఎన్టీఆర్ ని వదలవు.ఎందుకంటే ఆయన తెలుగు దేశం పార్టీ కి వారసుడు.అభిమానులందరూ తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు.కానీ ఎన్టీఆర్ కి అసలు రాజకీయాల మీద ప్రస్తుతం ఎలాంటి ఆసక్తి లేదని తెలుస్తుంది.అయితే గతం లో ఆయన అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినప్పుడు వెళ్లి కలిసాడు.
అప్పట్లో ఇది రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.#RRR సినిమా విషయం లో అభినందించడానికి ఆయనని పిలిచారు అని తెలిసినప్పటికీ కూడా, తెలుగు దేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ అయినా అమిత్ షాని కలవడం పై అసంతృప్తి వ్యక్త పరిచాడు.అందుకే ఇక నుండి ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని ఎన్టీఆర్ బలమైన నిర్ణయం తీసుకున్నాడట.నిన్న రామ్ చరణ్ – చిరంజీవి ఢిల్లీ లో అమిత్ షా ని కలిసిన సంగతి అందరికీ తెలిసిందే.సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి.
అయితే రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ ని కూడా ఆహ్వానించారట,అంతే కాదు నిన్న రామ్ చరణ్ హాజరైన ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ కి కూడా ఎన్టీఆర్ ని పిలిచారట.కానీ బీజేపీ పార్టీ సంబంధించిన ఏ ఈవెంట్ కి కూడా రాదల్చుకోలేదు అని ఎన్టీఆర్ మొహమాటం లేకుండానే చెప్పేశాడట.మరోపక్క తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ని రాబొయ్యే ఎన్నికలకు క్యాంపైన్ చేసే విధంగా ఎంత ప్రయత్నం చేసినా ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదట.తన పూర్తి ద్రుష్టి సినిమాల మీద మాత్రమే, రాజకీయ అరంగేట్రం కి ఇంకా ఎంతో సమయం ఉంది.

Junior NTR- Politics
ప్రస్తుతం నా కెరీర్ ఇప్పుడే ఊపందుకుంది, పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు కూడా వచ్చింది, దీనిని సరైన పద్దతి లో ఉపయోగించుకొని రాబొయ్యే రోజుల్లో హాలీవుడ్ రేంజ్ కి ఎదగాలని ఎన్టీఆర్ కోరిక అట.అందుకే ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదని ఖరా ఖండీగా చెప్పేస్తున్నాడట అందరికీ.