Junior NTR: నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తొలిసినిమా ఆ హీరోతోనేనా?
ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించబోతున్నాడట.అందుకు సంబంధించిన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసారని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం.

Junior NTR: మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ఇప్పుడు అందరూ పాన్ ఇండియన్ మూవీస్ తో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. వీరిలో మహేష్ బాబు, రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ ఇప్పటికే నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టి పలు సినిమాలను చిత్రీకరించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు.
రీసెంట్ గానే రామ్ చరణ్ యూవీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి V మెగా ప్రొడక్షన్స్ అనే సంస్థ ని ఏర్పాటు చేసి తొలి సినిమా లో హీరో నిఖిల్ ని పెట్టి ‘ఇండియా హౌస్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ ని చూసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించబోతున్నాడట.
ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించబోతున్నాడట.అందుకు సంబంధించిన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసారని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి కొత్త డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈయన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి మరియు వసిష్ఠ వంటి డైరెక్టర్స్ నేడు ఏ స్థానం లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు ఎన్టీఆర్ నుండి కూడా ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ మరియు హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అవుతారో లేదో చూడాలి.ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ తన మొదటి చిత్రం ప్రముఖ హీరో నాని తో చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందొ చూడాలి.ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ మరియు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ పై ఎంత శ్రద్ద చూపిస్తారో చూడాలి.
