Narne Nithin Movie: సినిమా రిలీజ్ కాకముందే ఫేమస్ అవుతున్న ‘నితిన్’.. ఇంతకీ ఎవరీయన?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ తరువాత ఆయన కుమారులు, మనువళ్లు ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు. వారి అండతో చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

  • Written By: Chai Muchhata
  • Published On:
Narne Nithin Movie: సినిమా రిలీజ్ కాకముందే ఫేమస్ అవుతున్న ‘నితిన్’.. ఇంతకీ ఎవరీయన?

Narne Nithin Movie: సినీ ఇండస్ట్రీలోకి నిత్యం కొత్త హీరోలు వస్తుంటారు. కానీ చివరి వరకు ఉన్నది కొద్ది మంది మాత్రమే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈమధ్య నేరుగా ఎంట్రీ ఇచ్చేవారికన్నా.. సినీ పెద్దల అండతో దిగిన వారే ఎక్కువవుతున్నారు. అయితే అందరూ స్టార్లు అవుతారని అనుకోవడానికి లేదు. అయితే వారిని ప్రోత్సహించడానికి మాత్రం గాడ్ ఫాదర్లు ముందుకు వస్తుంటారు. ఇప్పుడు లేటేస్టుగా ఇండస్ట్రీలోకి ఓ స్టార్ హీరో అండతో కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేశాడు. అది షూటింగ్ పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయింది. ఇప్పుడు మరో సినిమా లాంచ్ అయింది. అయితే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా థియేటర్లోకి రాకుముందే ఆయన పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఆయన ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ తరువాత ఆయన కుమారులు, మనువళ్లు ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు. వారి అండతో చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆఱ్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. టైగర్ హీరో ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తూ ఉంటారు. ఇటీవలే ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ పాన్ వరల్డ్ లెవల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఆయన అండతో కొత్త హీరో సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఆయన సినిమా ఇంకా థియేటర్లోకి రాకుముందే ‘నితిన్’ పేరు మారుమోగుతోంది.

నితిన్ ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ స్వయాన బావమరిది. అంటే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడే నితిన్. వాస్తవానికి నితిన్ ఇప్పటికే ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే సినిమాలో నటించారు. సతీష్ విగ్నేష్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. అయితే ఆ మూవీ విడుదల కాకముందే ఇప్పుడు మరో మూవీ స్టార్ట్ అయింది. గీతా ఆర్ట్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమా లాంచింగ్ గురువారం జరిగాయి.

అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నితిన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’కు సంబంధించిన లుక్స్ లో నితిన్ భారీ గడ్డంతో నోట్లో సిగరెట్ తో స్టైలీష్ గా ఉన్నారు. దీంతో నార్నె నితిన్ ఫ్యూచర్ల ఎన్టీఆర్ అంతటివారవుతారని అంటున్నారు. అయితే ఆయన మొదటి మూవీ షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో ఆ మూవీ రిలీజ్ అవుతుందా? లేక కొత్త మూవీ థియేటర్లోకి వస్తుందా? అనేది కన్ప్యూజన్ గా ఉందని చర్చించుకుంటున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు