‘అసూరన్’ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన యంగ్ టైగర్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రిలీవ్ కావడానికి ఇంకా నెలలు సమయం పట్టేలా ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ […]

  • Written By: Neelambaram
  • Published On:
‘అసూరన్’ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన యంగ్ టైగర్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రిలీవ్ కావడానికి ఇంకా నెలలు సమయం పట్టేలా ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ఇటీవలే వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘అసూరన్’ మూవీ తమిళంలో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో ఈ మూవీ డైరెక్టర్ తో కలిసి నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ మాస్ ఎమోషన్ కథను సిద్ధం చేశాడు. ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెల్సింది. వెట్రిమారన్ తమిళంలో తెరకెక్కించిన ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలమ్’, ‘విశారణై’, ‘వడ చెన్నై మూవీలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాలతో ఉత్తమ దర్శకుడిగా పేరుతెచ్చుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుపొందారు. ఇటీవలే ధనుష్ తో తెరక్కెక్కించిన ‘అసూరన్’ మూవీతో తమిళనాట సంచనలం సృష్టించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ తో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏ మూవీ చేయాలో సందిగ్ధం ఉన్నాడు. కాగా వెట్రిమాన్ కథ ఎన్టీఆర్ కు నచ్చడంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తుంగానే దర్శకుడు త్రివిక్రమ్ ను లైన్లో పెట్టాడు. గతంలో వీరి కాంబినేషన్లలో వచ్చిన ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇటీవల త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఉంటుందని అనుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనపించడం లేదు. అయితే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీవ్ కాకుండా ఇంకా నాలుగునెలలు సమయం పడుతుందని సమాచారం. ఈమేరకు వెట్రిమారన్ కథ నచ్చడంతో త్రివిక్రమ్ కంటే ముందుగానే ఈ మూవీ స్టార్ కానుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు