Jr NTR Dialogues: జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ ఉంటే, ప్రేక్షకులు విజిల్స్ తో ఊగిపోతూ ఉంటారు. అసలు సాధారణ మాట కూడా… తారక్ నోట మహా మంత్రం అవుతుంది. అందుకే.. ఎన్టీఆర్ డైలాగ్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. మరి అలాంటి ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ డైలాగ్స్ ఏమిటో చూద్దాం రండి.
ఆది:

Aadi
నా పేరు ఆది కేశవరెడ్డి.. ఎస్ ఆయన మనవుడినే. అరవకు.. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.
అమ్మతోడు అడ్డంగా నరికేస్తా
Also Read: Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?
సాంబ :

Samba Movie
రేయనక, పగలనక ఎండనక, వాననకా, వాగనక వరదనక, రాయనక రప్పనక, దుమ్మనక దుప్పనకా, ముళ్ళనక ముప్పనక, పురుగనక పామనక, కోడికూత కోయగానే నాగలెత్తి పొలం చేరి, సాలు పట్టి కొండ్రవేసి, దుక్కి దున్ని దుగాలేసి, నీరు పట్టి దమ్ము చేసి, విత్తునాటి పైరు పెంచి, పస్తులుండి పుస్తెలమ్మి, మందు జల్లి కలుపు తీసి, కాపు కాచి .. ముసలి ముతక అమ్మానాన్న పిల్ల జిల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి, కుప్ప నూర్చి బస్తాకెత్తి బండి కట్టి పట్నం వచ్చి, మిల్లు కొచ్చి బేరమాడి, కాటకెత్తి.. పైకమంతా లెక్కకట్టి కళ్ళకద్ది కట్ట కట్టి, పక్క నెట్టి, అలసట ఇంత తీర్చాలని అర కప్పు టీ అడిగితే.. ఆరుగాలం రైతు బిడ్డ నెత్తురంతా చమట చేసి .. వెనక్కి వేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోగా కాజేసే నీకెంత దమ్ములిబే…
రాఖీ :

Rakhi movie
ఆఫ్ట్రాల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి ఒక కోటీ యాభై లక్షల మంది మా రైల్వే లో ప్రయాణిస్తున్నారు సార్. ఎనిమిది వేల స్టేషన్లు సార్. లక్ష ఏడువేల కిలోమీటర్ల ట్రాక్ సార్. భారతదేశంలో రైల్వే రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్. 15 లక్షల మంది ఎంప్లాయిస్ సార్. ఒక్క మన సికింద్రాబాద్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 గార్డులు, 1200 డ్రైవర్లు, ఆరువేలమంది గ్యాంగ్ మెన్లు పని చేస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ ఏంటి సార్, ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నీకల్ బ్రాంచ్, మెయింటెన్స్ బ్రాంచ్, ఐ ఓ డబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి ఎన్నో బ్రాంచ్ ల్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయిలు డే అండ్ నైట్ కస్టపడి కోట్లమంది వారి గమ్యానికి సేఫ్ గా చేరుస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇస్తున్న ఆదాయం 56 వేల కోట్లు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్. ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారత దేశం స్తంభించి పోతుంది. ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి. పార్లమెంట్ ఆగిపోతుంది. అసెంబ్లీ కదిలిపోతుంది. మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్.
యమదొంగ :

Yamadonga movie
రేయ్. పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో, చూస్కో .. పులితో ఫోటో దిగాలి అనిపించింది అనుకో, కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది.
ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి, వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంటగలిపి ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి ? మానవ జాతి. తన భక్తి తో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పాశముని సైతం గడ్డిపోచగా నెంచి ప్రాణహారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి ? మానవ జాతి.
నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటకట్టుకున్న మీరు.. నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా, ఎంత అవివేకం ?, ఎంత అజ్ఞానం ? ఎంత కుసంస్కారం ?. నేటినుంచి దేవుడదికుడు, నరుడధముడు అన్న కించ భావాన్ని కూకటివేళ్లతో సైతం పెకిలించి వేసెద. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులనేలే అష్ట దిక్పాలకులు మనుగదానిచే పంచభూతములు సైతం, జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్టించెద.
స్వర్ణ మణిమయ రత్న చతలంకృతమైన ఈ సభ మందిరమున, అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతధా, శతధా సహస్రదా పాపా పంకిలమైన కుల, మాత, జాతి కూపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించెద. ఎనీ డౌట్స్.
బృందావనం :

Brindavanam movie
సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో ? కారక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దానిని బయటికి తెచ్చావనుకో.. రచ్చ..రచ్చే.
ఊసరవెల్లి :
కరెంట్ వైర్ కూడా నా లాగా సన్నగానే ఉంటది రా, దాన్ని టచ్ చేస్తే దానెమ్మ షాకే సాలిడ్ గా ఉంటుంది.
దమ్ము :
బతకండి బతకండి అని అంటే వినలేదు కదరా, కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు
చరిత్ర చరిత్ర అని నీలిగావు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరికి వచ్చే సరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని పది నిముషాలు పట్టలేదు నాకు. అదే, నేను ఓ గంట కాన్సంట్రేషన్ చేస్తే.. ఏమి మిగలదు.
బాద్ షా :

Baadshah movie
బాద్ షా ని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది. పిచ్ నీదైన మ్యాచ్ నాదే. బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.
టెంపర్ :

Temper movie
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదెడిపోతే.. దండయాత్ర. అదే దయాగాడి దండ యాత్ర.
ఈగో నా చుట్టూ వైఫై లా ఉంటుంది.. యూజర్ నేమ్ దయా.. పాస్ వర్డ్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా..
దండయాత్ర. ఇది దయా గాడి దండయాత్ర.
జనతా గ్యారేజ్ :

Janatha Garage movie
బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును
Also Read:Garuda Vega Producer: జీవిత రాజశేఖర్ మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు.. నిర్మాత సంచలన ఆరోపణలు