యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు హైకోర్టులో చివాట్లు!
ఉత్తరప్రదేశ్‌లో `పోలీస్ రాజ్’ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టులో చివాట్లు ఎదురయ్యాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల పేర్లు, వివరాలతో కూడిన హోర్డింగ్‌లను జిల్లా అధికారులు లక్నోలోని కూడళ్లలో ఏర్పాటు చేయడంపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది. అడ్వకేట్ శశాంక్ త్రిపాఠి వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై జస్టిస్ గోవింద్ మాతుర్, జస్టిస్ రమేష్ సిన్హాలతో కూడిన హైకోర్టు బెంచ్ విచారణ జరిపి తాజా ఆదేశాలిచ్చింది. వ్యక్తుల స్వేచ్ఛను […]

ఉత్తరప్రదేశ్‌లో `పోలీస్ రాజ్’ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టులో చివాట్లు ఎదురయ్యాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల పేర్లు, వివరాలతో కూడిన హోర్డింగ్‌లను జిల్లా అధికారులు లక్నోలోని కూడళ్లలో ఏర్పాటు చేయడంపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది.
తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది. అడ్వకేట్ శశాంక్ త్రిపాఠి వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై జస్టిస్ గోవింద్ మాతుర్, జస్టిస్ రమేష్ సిన్హాలతో కూడిన హైకోర్టు బెంచ్ విచారణ జరిపి తాజా ఆదేశాలిచ్చింది.
వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా జిల్లా యంత్రాంగం చర్య ఉందని కోర్టు మండిపడింది. వెంటనే హోర్డింగులు తొలగించి ఆ విషయం కోర్టుకు తెలియచేయాలని ఆదేశించింది.
ఇటీవల సీఏఏ నిరసనల్లో హింసాకాండ చెలరేగడంతో అల్లర్లకు పాల్పడిన వారి నుంచి జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని ప్రకటించిన యోగి సర్కార్ ఈ దిశగా చర్యలు చేపట్టింది.
ఆ క్రమంలోనే సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో హింసాకాండ పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న పలువురు వ్యక్తుల ఫోటోలు, పేర్లు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను లక్నో జిల్లా యంత్రాగం నగరంలోని కూడళ్లలో ఏర్పాటు చేయడం సంచలనమైంది.
హోర్డింగ్‌ల వల్ల సంబంధితులపై మూకదాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.