Site icon OkTelugu

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

Bank jobs

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. అభ్యర్థుల విన్నపం మేరకు 26వ తేదీ వరకు అదనపు సమయం ఇచ్చింది.

ఖాళీల వివరాలు..
మొత్తం 7,460 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ఖాళీలు, 745 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు వివిధ పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో భర్తీ అవుతాయి.

అర్హతలు ఇవీ..
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపులు వర్తిస్తాయి). దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175
ఇతర అభ్యర్థులకు రూ. 850 ఉంది. ఎంపికైన వారికి నెలవారీ జీతం రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు ఉంటుంది

దరఖాస్తు విధానం
అధికారిక వెబ్‌సైట్‌ జ్టి్టpట://ఠీఠీఠీ.జీbpట.జీn/ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు, నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు అక్కడే అందుబాటులో ఉంటాయి. గడువు ముగిసేలోపు దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.

బ్యాంకు ఉద్యోగార్థులకు మంచి ఛాన్స్‌..
బ్యాంకింగ్‌ రంగంలో పీవో, ఎస్‌వో ఉద్యోగాలు యువతకు అత్యంత ఆకర్షణీయమైనవి. మంచి జీతం, ఉద్యోగ భద్రత, రెగ్యులర్‌ ప్రమోషన్లు, పెన్షన్‌ వంటి సౌకర్యాలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు ఎప్పుడూ భారీ పోటీ ఉంటుంది. గడువు పొడిగింపుతో ఆలస్యంగా తెలుసుకున్నవారు, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునేవారు, చివరి క్షణంలో టెక్నికల్‌ సమస్యలు ఎదుర్కొన్నవారు లాభపడతారు. అయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కేవలం దరఖాస్తు చేసుకోవడం సరిపోదు. పీవో, ఎస్‌వో ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. ప్రతి స్టేజ్‌లోనూ మంచి సన్నాహాలు, టైమ్‌ మేనేజ్‌మెంట్, మాక్‌ టెస్టులు అవసరం. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులు ఫీజు తక్కువ కావడం వల్ల ఎక్కువగా లాభపడతారు.

ఐబీపీఎస్‌ దరఖాస్తు గడువు 26 వరకు గడువు పెంచిన నేపథ్యంలో సరైన సన్నాహాలతో ఈ ఉద్యోగాలు మీ కెరీర్‌కు మంచి పునాది అవుతాయి. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version