Jaya Prada: ముంబై హీరోయిన్స్ ముందుగానే పక్కకెక్కుతున్నారు.. జయప్రద హాట్ కామెంట్స్
ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ కూడా దర్శకులు, నిర్మాతలు అడగకముందే కమిట్మెంట్ లు ఇస్తున్నారు. ఇలా చేయకపోతే అవకాశాలు రావని వారి నమ్మకం.

Jaya Prada: ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాకుండా ‘మీటూ’ అంటూ ఒక ఉద్యమం నడిచింది. ఆ సమయంలో అనేక మంది తాము ఎదుర్కొన్న సమస్యలు గురించి పబ్లిక్ లో మాట్లాడారు. ఆ తర్వాత అది సైలెంట్ అయినా కానీ అప్పుడప్పుడు కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీటిపై వెటరన్ హీరోయిన్ జయప్రద చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యి, హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్న జయప్రద ఆ తర్వాత సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా ఉంటుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ అనేది మా రోజుల్లో అసలు లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఈ రోజుల్లో అది లేదు. అవకాశాలు కోసం దర్శకులకు, నిర్మాతలకు లొంగిపోవాల్సి వస్తుంది.
ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ కూడా దర్శకులు, నిర్మాతలు అడగకముందే కమిట్మెంట్ లు ఇస్తున్నారు. ఇలా చేయకపోతే అవకాశాలు రావని వారి నమ్మకం.. ఇండస్ట్రీలో ఈ ధోరణి పోవాలి. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావాలి. కానీ అది అంత త్వరగా జరిగే వ్యవహారం కాదు. ముందు అమ్మాయిల ఆలోచన విధానం మారాలి. మనలో టాలెంట్ ఉంటే కొంచెం ఆలస్యమైనా అవకాశాలు అవే వస్తాయి. అదే నమ్మకంతో పని చేయాలి కానీ, పడుకుంటేనే అవకాశాలు వస్తాయనే ఆలోచనలు ఉండకూడదు అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది జయప్రద.
జయప్రద చెప్పింది అక్షరాల నిజం. కమిట్మెంట్ అనేది లేకుండా నిజాయితీగా ఉంటే తమ సినిమాకు ఎలాంటి హీరోయిన్ అవసరమో అలాంటి వాళ్ళని తీసుకుంటారు. కానీ చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు కోసం ముందుగానే కమిట్మెంట్ కి సిద్ధం అవుతున్నారు. కేవలం వెండితెర మీద కాదే బుల్లితెర మీద ఇలాంటి జరుగుతున్నాయి. కొన్ని సమయాల్లో ప్రియుడి కెరీర్ కోసం దర్శక, నిర్మాతలకు లొంగుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ముందు ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి సొంత టాలెంట్ మీద నిలబడితే అవకాశాలు కచ్చితంగా వస్తాయి. లేకపోతే ఇలాంటి కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశమే లేదు.
