Jawan box Office Collection : జవాన్ తొలిరోజు కలెక్షన్స్ : షారుఖ్ ఖాన్ కే దిమ్మదిరిగిపోయింది..
జవాన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. జవాన్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ – ఆక్యుపెన్సీ ఇక్కడ ఉన్నాయి.

Jawan box Office Collection : షారుఖ్ ఖాన్, నయనతార , విజయ్ సేతుపతి నటించిన జవాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆల్ టైమ్ అతిపెద్ద బాలీవుడ్ ఓపెనర్‌గా అవతరించింది. హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. జవాన్ ఇప్పటికే షారుఖ్ గత చిత్రం పఠాన్ ను దాటేసింది. తొలిరోజు ఏకంగా 14 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించి రికార్డ్ సృష్టించింది.. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
జవాన్ ఇప్పటికే భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 35.6 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. అసాధారణమైన అడ్వాన్స్ బుకింగ్ లు నమోదవుతున్నాయి. జవాన్ దాదాపు 10,000 స్క్రీన్‌లలో విడుదలవుతోంది. ఇది భారతీయ చలనచిత్రంలో అత్యధికంగా విడుదలైన వాటిలో ఒకటిగా నిలిచింది.
జవాన్‌లో దీపికా పదుకొణె కూడా ప్రత్యేక పాత్రలో కనిపించింది. భారీ హైప్ మధ్య ఈ సినిమా మొదటి షో ఉదయం 6 గంటలకు వేశారు. సినిమా ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ మాట్లాడుతూ జవాన్ అన్ని భాషల్లో ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్ 85 కోట్ల రూపాయలను నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు.
జవాన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. జవాన్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ – ఆక్యుపెన్సీ ఇక్కడ ఉన్నాయి.
జవాన్ తన మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి 75.00 కోట్ల నెట్
కలెక్షన్ సాధించింది.
హిందీ: 65 కోట్ల నెట్
తమిళం: 5 కోట్ల నెట్
తెలుగు: 5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
#OneWordReview…#Jawan: MEGA-BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️½
A hardcore masala entertainer that’s sure to stand tall in #SRK’s filmography… #Atlee presents #SRK in a massy character and he is 🔥🔥🔥… Move over #Pathaan, #Jawan is here to conquer hearts and #BO, both.… pic.twitter.com/4bwFrBAFYz— taran adarsh (@taran_adarsh) September 7, 2023
