Jasprit Bumrah: టీమిండియా ఏడాది ఆరంభంలో విజయాలు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో దూసుకుపోయింది. మ్యాచ్ ఏదైనా టీమిండియాదే విజయం వరించింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఆడిన మ్యాచుల్లో కూడా మనదే పైచేయి సాధించింది. ఈ క్రమంలో ఆసియా కప్ సమయంలో తగిలిన ఎదురుదెబ్బ ఇప్పటికి కూడా కంటిన్యూ అవులోంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లోనే ఇంటిదారి పట్టడం విమర్శలకు తావిచ్చింది. దీంతో టీమిండియాపై విమర్శల పరంపర కొనసాగుతోంది. దీంతో జట్టును మార్చాలని బీసీసీఐ యోచిస్తోంది.

Jasprit Bumrah
టీమిండియా ఓటమికి ప్రధాన కారణం మన బౌలింగ్ సరిగా లేకపోవడమే. వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో దెబ్బతిని ఇంటి దారి పట్టింది. దీంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం బుమ్రా తిరిగి ఫిట్ నెస్ సాధించడంతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా విడుదల చేశాడు. టీమిండియా అభిమానులు ఇప్పుడు ఖుషి అవుతున్నారు. ఇన్నాళ్లు ఓటములతో నిరాశపడిన వారికి బుమ్రా మందు టానిక్ లా పనిచేయనుంది.
ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఓటమి నిరాశ కలిగించింది. ఆరంభంలో అదరగొట్టినా తరువాత డీలా పడింది. ఓటమిని మూటగట్టుకుంది. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో బౌలింగ్ చప్పగా మారింది. మన బౌలర్లను వారు ఆడేసుకున్నారు. ప్రస్తుతం బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడంతో ఇక ప్రత్యర్థుల పని పట్టేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లు టీమిండియాకు కష్టకాలం కావడంతో వన్డే, వచ్చే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తో పాటు 2024లో టీ20 మెగా టోర్నీ జరగనుంది.

Jasprit Bumrah
బుమ్రాతోపాటు మరికొందరు బౌలర్లు తమ ప్రభావం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని మ్యాచుల్లో ఒక్కడే ప్రభావం చూపలేడు కదా. అందుకే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ప్రదర్శన చేస్తే ఫలితాలు బాగుంటాయి. ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, యష్ దయాళ్ వంటి యువతను తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తవారికి చాన్స్ లు ఇచ్చి టీమిండియా కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బుమ్రా రాకతో ఇక టీమిండియా కష్టాలు తీరినట్లే అని క్రీడా నిపుణులు చెబుతున్నారు.