Rina Gonoi : జపాన్ ను రక్షించాలనుకుంది.. తోటి సైనికుల చేతుల్లో ఈమె లైంగిక వేధింపుల పాలైంది
కొరియామా క్యాంప్‌లో కొంతమంది దుండగులు ఇతర మహిళా సభ్యులను లైంగికంగా వేధించినందుకు వారిని దోషులుగా తేల్చింది. ఐదుగురు సైనికాధికారులు.. 40 ఏళ్ల మాస్టర్ సార్జెంట్ ను డిసెంబర్ 2022లో డిస్మిస్ చేశారు.

Rina Gonoi : వాళ్లు దేశాన్ని రక్షించాల్సిన సైనికులు.. దేశ ప్రజల మాన, ధన, ప్రాణాలకు కాపాడడం వారి విధి. అయితే సైన్యం అంటేనే చాలా క్రమశిక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి. అందులో పొరపాట్లకు తావు ఉండదు. చేసినా కఠిన శిక్షలు ఉంటాయి. కానీ సైన్యంలోనూ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయని.. వాళ్లు కొన్ని ఉద్రేకాలను నియంత్రించుకోలేరని జపాన్ లో జరిగిన ఒక ఘటన చర్చనీయాంశమైంది. సైన్యంలో చేరిన ఒక మహిళా సైనికురాలిని అక్కడ మగ సైనికులు లైంగిక వేధింపులు చేశారన్న విషయం సంచలనమైంది. ఆ మహిళా సైనికురాలి ఆరోపణలు ఇప్పుడు జపాన్ సైన్యాన్ని.. జపాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
జపాన్‌లోని గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జిఎస్‌డిఎఫ్)లో పనిచేస్తున్నప్పుడు మగ సైనికుల చేతుల్లో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని.. పదేపదే వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక మహిళా సైనికురాలు జపాన్ ప్రభుత్వంతోపాటు ఆమెను వేధించిన ఐదుగురు సైనికులపై సివిల్ కోర్టులో దావా వేసింది.
2021 ఆగస్టులో తాను సైన్యంలో సైనికురాలిగా ఉన్న సమయంలో ముగ్గురు సైనికాధికారులు నా శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో 10 మంది సైనికులు ఈ ఘటన చూసి నవ్వుకున్నారు. అందులో ఏ ఒక్కరూ అధికారులను వారించలేదు. ఆ దారణంపై ఫిర్యాదు చేసినప్పటికీ సరైన దర్యాప్తు చేయకుండానే దాన్ని మూసేశారు అంటూ రీనా గొనోయ్ సోషల్ మీడియాలో గళమెత్తారు. సివిల్ కోర్టులో దావా వేశారు. సైనిక అధికారులపై న్యాయపోరాటానికి దిగారు.
ఈమెకు మద్దతుగా లక్షమంది సంతకాలతో కూడిన పిటీషన్ దాఖలు చేశారు. రీనా గొనోయ్ రక్షణశాఖకు అందించారు. దీనిపై జపాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మహిళ సైనికురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ చీప్ అంగీకరించారు. ఇందుకు క్షమాపణ కోరిన ఆయన బాధ్యులపై చర్యలు చేపట్టారు.
ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని జిఎస్‌డిఎఫ్ క్యాంప్ కొరియామాలో జరిగిన అనేక రకాల దుర్వినియోగాల గురించి విచారణలో తేలింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమె ఆరోపణలను ధృవీకరించింది. రీనా గొనోయిని పదేపదే లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు, “భోజన సమయంలో మగ సభ్యులు ఆమె శరీరానికి అసభ్యంగా తాకి కాళ్లపై నొక్కి నేలపైకి బలవంతంగా తన్నారని” అంగీకరించారు. దీంతో రక్షణ శాఖ గతేడాది సెప్టెంబర్‌లో గొనోయికి క్షమాపణలు చెప్పింది.
కొరియామా క్యాంప్‌లో కొంతమంది దుండగులు ఇతర మహిళా సభ్యులను లైంగికంగా వేధించినందుకు వారిని దోషులుగా తేల్చింది. ఐదుగురు సైనికాధికారులు.. 40 ఏళ్ల మాస్టర్ సార్జెంట్ ను డిసెంబర్ 2022లో డిస్మిస్ చేశారు.
దర్యాప్తు కోసం గోనోయి చేసిన ఫిర్యాదును పట్టించుకోని యూనిట్ కమాండర్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు
ఇలా ఒక దేశం సైన్యంలో మహిళలకు రక్షణ లేదన్న విషయం ఓ మహిళ పోరాటం నిజమైంది. ఇప్పటికీ చాలా దేశాల్లో మహిళలను సైన్యంలో చేర్చుకోవడం లేదు. జపాన్ లాంటి చిన్న జనాభా దేశంలో అనుమతిస్తున్నా..సైనికురాళ్లపై కూడా ఇలాంటి వేధింపులు రావడం నిజంగా సిగ్గుచేటైన విషయం. ఈ విషయాన్ని చూసి చూడకుండా వదిలేసిన సైన్యాధికారులపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని జపాన్ ప్రభుత్వం ఇలాంటివాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
