అమ్మని మరచిపోలేక పోతున్న జాన్వీ

బాలీవుడ్ నటి జాన్వి కపూర్ చాలా సినిమాలు చేయకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ రోజు (మార్చి 6) ఆమె పుట్టినరోజు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో దివంగత తల్లి శ్రీదేవితో తాను ఉన్న చిత్రాలను షేర్ చేశారు. శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వి కపూర్ ‘ధడక్’ చిత్రంలో అడుగుపెట్టడానికి ముందే అభిమానులను సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు శ్రీదేవి తన కుమార్తె జాన్వి మొదటి చిత్రం విడుదలకు ముందే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక […]

  • Written By: Neelambaram
  • Published On:
అమ్మని మరచిపోలేక పోతున్న జాన్వీ

బాలీవుడ్ నటి జాన్వి కపూర్ చాలా సినిమాలు చేయకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ రోజు (మార్చి 6) ఆమె పుట్టినరోజు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో దివంగత తల్లి శ్రీదేవితో తాను ఉన్న చిత్రాలను షేర్ చేశారు. శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వి కపూర్ ‘ధడక్’ చిత్రంలో అడుగుపెట్టడానికి ముందే అభిమానులను సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు శ్రీదేవి తన కుమార్తె జాన్వి మొదటి చిత్రం విడుదలకు ముందే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ… జాన్వి తనతో, చిన్న కుమార్తె ఖుషీ తండ్రి బోనీతో సన్నిహితంగా ఉంటారని చెప్పారు. శ్రీదేవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జాన్వి, ఖుషీ చిత్రాలను షేర్ చేస్తుండేవారు.

శ్రీదేవి రెండేళ్ల క్రితం 6 మార్చి 2017 న తన కుమార్తె జాన్వి పుట్టిన రోజును ఘనంగా చేసారు. ఈ సందర్భంగా శ్రీదేవి.. ‘నా దేవదూతకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆమె ఈ ప్రపంచంలో నాకు చాలా విలువైనదని పేర్కొన్నారు. జాన్వి కపూర్ కూడా ప్రతిరోజూ తన తల్లి శ్రీదేవిని గుర్తుచేసుకుంటారు. జాన్వీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు, దానిలో ఆమె… నేను ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నాను అని రాశారు. కాగా తన తల్లి శ్రీదేవి, తండ్రి బోనీ తాను నటిని కావాలని కోరుకోవడం లేదని గతంలో జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం జాన్వి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రూహి అఫ్జా’, ‘గుంజన్ సక్సేనా’, ‘తఖ్త్’, ‘బాంబే గర్ల్’, ‘రణభూమి’, ‘దోస్తానా 2’ తదితర చిత్రాల్లో జాన్వీ నటిస్తోంది.

సంబంధిత వార్తలు