Pawan Kalyan Alliances: జనసేనలో ఉండే వైసీపీ కోవర్టులకు క్లారిటీగా ధమ్కీ ఇచ్చిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి ఎవరు అనేది కాదని అన్నారు.

Pawan Kalyan Alliances: ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరువిప్పారు. పొత్తులపై స్పష్టత ఇచ్చారు. ఒంటరి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. జనసేనలో ఉన్న వైసీపీ కోవర్టులకు సూచాయప్రాయంగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కోసం పనిచేస్తూనే పక్కదోవ పట్టిస్తున్న వారు పద్ధతి మార్చుకోవాలని పరోక్షంగా సూచించారు. జగన్ ను గద్దె దించడమే అంతిమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఏ వ్యూహం చేసినా రాష్ట్ర హితం కోసమేనని తేల్చి చెప్పారు.
పొత్తుపై త్వరలో ఓ ఆశాజనక నిర్ణయం త్వరంలో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాబోవు ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు వెళ్తాయని అన్నారు. పొత్తు కొలక్కి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నామో స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు.
పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి ఎవరు అనేది కాదని అన్నారు. పార్టీని తప్పుదోవ పట్టించుకుండా బలోపేతానికి కృషి చేయాలని కొందరు జనసేన నాయకులను ఉద్దేశించి అన్నారు. పార్టీలోనే ఉంటూ వైసీపీకి తాబేదారుగా వ్యవహరిస్తున్న ఆ కొందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఏం చేసినా, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
జనసేన అంతిమ లక్ష్యం వైసీపీని గద్దె దించడమేనని పవన్ తేల్చి చెప్పారు. ముందు కష్టపడి అనుకున్న ఫలితం వచ్చిన తరువాత సీఎం ఎవరనేది ఆ రోజు బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్రిముఖ పోటీలో వైసీపీకి అవకాశం కల్పించాలని పార్టీ నాయకులే కోరుకోవడం శోచనీయమని అన్నారు. బలికావడానికి జనసేన సిద్ధంగా లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తు ప్రభుత్వాన్ని గద్దెను ఎక్కించడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు.
మొత్తంగా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయంగానే కనిపిస్తుంది. అధికారి ప్రకటన రావాల్సి ఉంది. రాష్ట్రంలో విపక్ష పార్టీల్లో జరుగుతన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ అరాచకాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతుంది. జనసేనపై బురద జల్లే కార్యక్రమాలు ఒకటి రెండు తాజాగా సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ అలర్ట్ అయ్యారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని చెబుతూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, కోవర్టులను గుర్తించే పనిలో పడినట్లు తెలుస్తోంది.
