Jamuna- NTR: ఒకప్పుడు కథలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత హీరోయిన్ కి కూడా ఉండేది. హీరోయిన్స్ హీరోలకు సమానమైన స్టార్డం అనుభవించేవారు. మేము హీరోలకంటే ఎందులోనూ తక్కువ కాదనే ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ మైంటైన్ చేసేవారు. భానుమతి, జమున లాంటి హీరోయిన్స్ స్టార్స్ కి కూడా చుక్కలు చూపించారు. ముఖ్యంగా జమున సెట్స్ లో హుందాతనం చూపించేవారట. కాగా ఓ సినిమాలో ఆమె ఎన్టీఆర్ ని కాలితో తన్నడం వివాదాస్పదమైంది. శ్రీకృష్ణ తులాభారం మూవీలో జమున సత్యభామ పాత్ర చేశారు.

Jamuna- NTR
ఆ పాత్ర జమున కెరీర్లో ఐకానిక్ రోల్ గా నిలిచిపోయింది. జమున అంటే సత్యభామ అన్నట్లు పరిశ్రమలో పేరొచ్చింది. ఇక కథలో భాగంగా శ్రీకృష్ణుడిపై అలిగిన సత్యభామ ఆయన్ని కాలితో తంతుంది. కోపంగా ఉన్న సత్యభామను బుజ్జగించేందుకు శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ల వద్ద కూర్చుంటాడు. ఏమరపాటులో ఉన్న సత్యభామ గమనించకుండా కాలు విదిలిస్తుంది. అది శ్రీకృష్ణుడు తలకు తగిలి ఆయన కిరీటం కిందపడిపోతుంది.
శ్రీకృష్ణుడు పాత్ర చేసిన ఎన్టీఆర్ ని జమున తన్నడం వివాదాస్పదమైంది. నిజానికి అది ఓ సన్నివేశంలో భాగం అయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు అంగీకరించలేకపోయారు. అప్పటికే ఎన్టీఆర్ భారీ స్టార్డం తో వెండితెర ఇలవేల్పుగా కొనియాడబడుతున్నారు. దీంతో జమున ఎన్టీఆర్ ని తన్నడం జీర్ణించుకోలేకపోయారు. అకారణంగా జమున ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గుయారయ్యారు. మెల్లగా ఆ వివాదం సద్దుమణిగింది. అయితే ఇతర కారణాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్ జమునను దూరం పెట్టారు. అధికారికంగా బ్యాన్ ప్రకటించారు.

Jamuna- NTR
టాలీవుడ్ లో అతి పెద్ద స్టార్స్ గా ఉన్న తమకు జమున గౌరవం ఇవ్వడం లేదు. సెట్స్ కి వేళకు రావడం లేదు. మా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటోంది అంటూ… అనేక ఆరోపణలు చేస్తూ జమునను బ్యాన్ చేశారు. వారికి క్షమాపణలు చెప్పి వివాదానికి ముగింపు పలకాలని జమునను కొందరు కోరారు. వాళ్ళ సినిమాల్లో నన్ను తీసుకోకపోయినా పర్లేదు, క్షమాపణలు చెప్పేది లేదని జమున భీష్మించుకు కూర్చున్నారు.
దాదాపు నాలుగేళ్లు జమునను ఎన్టీఆర్, ఏఎన్నార్ పక్కన పెట్టారు. ఈ సమయంలో జమున జగ్గయ్య, కాంతారావు, హరనాథ్ తో పాటు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేశారు. వారి బ్యాన్ జమున కెరీర్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. ఎట్టకేలకు పరిశ్రమ పెద్దలలో ఒకరైన చక్రపాణి గారు ముగ్గురినీ కూర్చోబెట్టి మందలించి వివాదానికి తెరదించారట.