Jalandhar Lok Sabha By-Election 2023: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. అక్కడ ఓటమి..
రాహుల్ గాంధీ జోడోయాత్ర సందర్భంగా పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ తరుణంలో మే 10న ఉప ఎన్నికలు నిర్వహించారు.

Jalandhar Lok Sabha By-Election 2023: కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది.. రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సమావేశం నిర్వహించనుంది.. కానీ ఇంతలోనే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పంజాబ్ లోని లోక్ సభ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఆప్ అభ్యర్థి సుశీల్ రింకు గెలుపొందారు. వాస్తవానికి సుశీల్ కుమార్ రింకూ ఏప్రిల్ 5 నాటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆప్ లో చేరాల్సి వచ్చింది. వచ్చీ రాగానే ఎంపీ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఆ స్థానం గెలుపొందడంతో సుశీల్ ఎంపీగా ఎన్నికయ్యాడు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుండగా.. జలందర్ లో మాత్రం నిరాశతో ఉంది.
రాహుల్ గాంధీ జోడోయాత్ర సందర్భంగా పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ తరుణంలో మే 10న ఉప ఎన్నికలు నిర్వహించారు. మే 13న రిలీజైన ఫలితాల్లో ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ కాంగ్రెస్ అభ్యర్థి కరమ్ జిత్ కౌర్ పై 50 వేల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ దే అయినా ఓడిపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎంపీగా గెలుపొందిన సుశీల్ కుమార్ రింకూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జలందర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. అయితే అక్కడ ఆప్ అభ్యర్తి షీతల్ అంగురల్ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో సుశీల్ రింకరూ కాంగ్రెస్ పార్టీలోఉంటూనే వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం అధిష్టానానికి వెళ్లడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతోవెంటనే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ సమక్షంలో చేరారు.
వచ్చీరాగానే ఆయనకు ఎంపీ సీటును కేటాయించారు. ఇప్పడు ఏకంగా గెలుపొంది ప్రత్యేకంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టినా ఆప్ ద్వారా ఎంపీ కావడంపై ఆయన గురించి తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా రింకూ రాకతో ఆప్ పార్టీ మరింత బలోపేతం అవతుందని అప్పుడే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. అనుకున్నట్లుగానే సుశీల్ కుమార్ రింకూ నిరూపించారు.
