Rajinikanth Jailer: భారీ లాభాల్లో జైలర్ .. రజినీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా లు కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా మలయాళంలో ఈ సినిమా 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.

Rajinikanth Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్డం కు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటున్నారు కానీ ఎన్నో ఏళ్ల క్రితమే వాటిని అందుకున్న నటుడు రజినీకాంత్. కానీ ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో రజిని స్థాయి తగ్గిపోయిందని ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రజనీ మానియా పనిచేయదని రకరకాల కామెంట్స్ వినిపించాయి.
అలాంటి కామెంట్స్ కు ఒకే ఒక్క సినిమాతో చెక్ పెట్టారు సూపర్ స్టార్. ఆగస్టు 10 న వరల్డ్ వైడ్ గా విడుదలైన జైలర్ సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ విజయాన్ని అందుకుంది. రజినీకాంత్ కి తమిళ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా దానికి తగ్గట్టు క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లే తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించింది ఈ సినిమా.
మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా లు కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా మలయాళంలో ఈ సినిమా 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. మలయాళం సూపర్ స్టార్స్ కి మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు జైలర్ ఈజీగా బద్దలు కొట్టింది. ఇటు కన్నడ లో కావచ్చు హిందీలో కావచ్చు, ఓవర్శిస్ లో కావచ్చు వసూళ్ల సునామీ సృష్టిస్తుంది జైలర్ మూవీ. ఇప్పటికే సుమారు గా 650 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా ఇంకా థియోటర్ల లో రన్ అవుతూనే ఉంది.
కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన జైలర్ సినిమా ఊహకందని వసూళ్లు సాధించటంతో నిర్మాణ సంస్థ కూడా చాలా హ్యాపీగా ఉంది. తాజాగా నిర్మాత మారన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో ఒక చెక్ ను కూడా అందించారు. సినిమా భారీ వసూళ్లు సాధించటంతో వచ్చిన లాభాల్లో రజినీకాంత్ కు వాటా రూపంలో దాదాపు 100 కోట్లు చెక్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు రజినీకాంత్ తో ఇంకో సినిమా కంఫర్మ్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు.
జైలర్ మూవీకి దాదాపు 110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు రజినీకాంత్. ఇప్పుడు ఇచ్చిన 100 కోట్లు కూడా ఈ సినిమా లాభాల్లో వాటా అనుకుంటే జైలర్ సినిమాకి రజనీ రెమ్యూనరేషన్ 210 కోట్లు. ఇండియా లోనే ఇదొక రికార్డు అని చెప్పాలి. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఆ చెక్ కవర్ మీద “ది రియల్ రికార్డు మేకర్ ” అని రాసి ఉంది.
