Ram Gopal Varma: జై బాలయ్య.. వర్మ వేశాడయ్య
కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ నేపథ్యంతో ఉన్న సినిమాలు తీస్తున్నారు. లేటెస్ట్ మూవీ వ్యూహం కూడా సోషల్ మీడియాలో బాగానే హాట్ టాపిక్‌గా నిలిచింది. సీఎం జగన్ రాజకీయ జీవితంపై వస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో టీడీపీ, చంద్రబాబుతోపాటు కాంగ్రెస్ పార్టీ జగన్‌కు చేసిన మోసాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఆర్జీవీ అమెరికాలో జై బాలయ్య అని నినదించడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

Ram Gopal Varma: విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన పేరు. ఆ పేరు వెనుకాల ఉండే విజన్ చాలా అరుదు. ఆయన ఏం చేసినా కాంట్రవర్సీగానో.. జోక్‌గానో మారుతుంది. ఏది చేసినా సెన్షేన్ కావాలని, మీడియాలో ఉండాలని భావించే ఆర్జీవీ తాజాగా 20 ఏళ్ల తరువాత నాటా వేడుకల కోసం అమెరికా వెళ్లాడు. తెలుగు వారికి సంబంధించిన ఈవెంట్స్‌లో పాలొని ఎంతో హుషారుగా వారితో గడిపాడు. అక్కడ టపాసులు కాల్చుతూ.. జై బాలయ్య అని నినదించాడు. అక్కడ ఉన్న తెలుగు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా జై బాలయ్య అనే నినాదాలు చేశారు. ఈ వీడియోను ఆర్జీవీ ట్విట్లర్‌లో పోస్టు చేశాడు. వర్మ ఎలా ఎంజాయ్ చేస్తాడో మరోసారి వీడియోల ద్వారా అర్ధమవుతోంది.
కాంట్రవర్సీకి కేరాఫ్..
తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సీ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రామ్‌గోపాల్ వర్మనే. అమ్మాయిలతో డ్యాన్స్ చేసినా.. హీరోయిను ముద్దు పెట్టుకున్నా.. బార్లలో చిందులు వేసినా.. దెయ్యాల సినిమా తీసినా.. ఫ్యాక్షన్ రాజకీయాలను తెరకెక్కించినా ఆయనకే చెందుతుంది. అభిమానులు పెద్దగా లేకపోయినా.. ఆర్జీవీ సినిమాలు చూసేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా అమెరికా గడ్డపై చిందేసి అందరినీ ఆశ్చర్యపర్చారు.
పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాలు..
కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ నేపథ్యంతో ఉన్న సినిమాలు తీస్తున్నారు. లేటెస్ట్ మూవీ వ్యూహం కూడా సోషల్ మీడియాలో బాగానే హాట్ టాపిక్‌గా నిలిచింది. సీఎం జగన్ రాజకీయ జీవితంపై వస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో టీడీపీ, చంద్రబాబుతోపాటు కాంగ్రెస్ పార్టీ జగన్‌కు చేసిన మోసాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఆర్జీవీ అమెరికాలో జై బాలయ్య అని నినదించడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
Jai Balayya pic.twitter.com/DyfJzzYfTF
— Ram Gopal Varma (@RGVzoomin) July 6, 2023