జాన్వీ కపూర్‌ డాన్స్.. వీడియో వైరల్

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అందంతో పటు నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తొలి చిత్రం ‘ధడక్’ మూవీ తో జాన్వీ అభిమానుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ పాన్ ఇండియా మూవీ ‘తఖ్త్‌’లో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫైటర్’ మూవీ లో జాన్వీ నటిస్తుందనే వార్తలు హల్చల్ చేసాయి. కాని జాన్వీకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వాళ్ళే ‘ఫైటర్’ సినిమా […]

  • Written By: Neelambaram
  • Published On:
జాన్వీ కపూర్‌ డాన్స్.. వీడియో వైరల్

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అందంతో పటు నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తొలి చిత్రం ‘ధడక్’ మూవీ తో జాన్వీ అభిమానుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ పాన్ ఇండియా మూవీ ‘తఖ్త్‌’లో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫైటర్’ మూవీ లో జాన్వీ నటిస్తుందనే వార్తలు హల్చల్ చేసాయి. కాని జాన్వీకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వాళ్ళే ‘ఫైటర్’ సినిమా వదులుకుందని సమాచారం. ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీ లో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుందని చిత్రబృందం ప్రకటించారు.

తాజాగా జాన్వీ కపూర్‌ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ డాన్స్ వీడియోని షేర్ చేసింది. ‘పియా తోసే నైనా లాగిరే’ అనే పాటకు వయ్యారంగా డాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు అచ్చం శ్రీదేవి లానే చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/B8-tSpdnDsq/

సంబంధిత వార్తలు