Jagapathi Babu: నాన్న వారసుడిని అడిగితే బయట ట్రై చేయనా అన్నాను… సౌందర్యతో ఎఫైర్ పై జగపతిబాబు కీలక వ్యాఖ్యలు!

సితార మ్యాగజైన్ లో మొదటిసారి… ”సౌందర్యను జగపతిబాబు వివాహం చేసుకోవడం లేదు” అని హెడ్డింగ్ పెట్టి రాశారు. అది చదివి నేను షాక్ అయ్యాను.

  • Written By: SRK
  • Published On:
Jagapathi Babu: నాన్న వారసుడిని అడిగితే బయట ట్రై చేయనా అన్నాను… సౌందర్యతో ఎఫైర్ పై జగపతిబాబు కీలక వ్యాఖ్యలు!

Jagapathi Babu: పరిశ్రమలో జగపతిబాబుకు ముక్కుసూటి మనిషి అనే పేరుంది. నచ్చని విషయాన్ని ముఖం మీద చెప్పేస్తాడు. వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన ఓపెన్ అయిపోతారు. జూదాలు, వ్యసనాల కారణంగా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నానని ఆయన పలుమార్లు చెప్పారు. జగపతిబాబు లైఫ్ లో ఉన్న మరో కాంట్రవర్సీ సౌందర్యతో ఎఫైర్. ఒకటి రెండు సందర్భాల్లో అవును… మా మధ్య రిలేషన్ ఉందని ఆయన చెప్పడం కొసమెరుపు. తాజాగా మరోసారి ఆయన ఈ టాపిక్ తెచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందా అని జర్నలిస్టులు అడగడం, మీరు సమాధానం చెప్పడం కరెక్టేనా? ఆ హీరోయిన్స్ కి ఫ్యామిలీలు ఉంటాయి. చాలా ఇబ్బంది పడతారు కదా? అని జగపతిబాబును యాంకర్ అడిగింది. మంచి ప్రశ్న అడిగారన్న జగపతిబాబు వివరించాడు… మా నాన్న అందరూ అమ్మాయిలే వారసుడు లేడు అని నాతో అన్నాడు. మనం పోయాక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు వారసుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నాను. అలా కాదురా వారసుడు ఉండాలి అన్నాడు.

మరి ఇంట్లో ఒప్పుకోరు(భార్య) బయట ట్రై చేయనా? అని సరదాగా అన్నాను. ఓ పూజారి ఇలాంటి వాటికి ఓ హీరోయిన్ ఉంది అన్నాడు. నాకు ప్రపంచం ఇలా ఉందా అనిపించింది. సితార మ్యాగజైన్ లో మొదటిసారి… ”సౌందర్యను జగపతిబాబు వివాహం చేసుకోవడం లేదు” అని హెడ్డింగ్ పెట్టి రాశారు. అది చదివి నేను షాక్ అయ్యాను. మా మధ్య ఎఫైర్ ఉంది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు చేసుకోవడం లేదని రాసుకొచ్చారు. అది రాసిన వాడిని అడిగాను. ఇవన్నీ కామన్ సర్ అన్నాడు. వాడి పై వాడికి చెప్పినా ప్రయోజనం లేదు.

అప్పుడు నేరుగా రామోజీ రావు దగ్గరికి వెళ్ళాను. ఇలాంటివి మీకు అవసరమా? నాకు ఏం కాదు. ఆ హీరోయిన్(సౌందర్య) పరిస్థితి ఏంటి? మంచి మనిషి, టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమెకు వివాహం అవుతుందా? అని అన్నాను. నాకు తెలియదు బాబు అన్నాడు. మీరే ఎడిటర్ కదా తెలియదంటే ఎలా అన్నాను. అప్పుడు ఆయన చర్యలు తీసుకున్నాడు. ఈ ఎఫైర్ ప్రశ్నలు అడిగినప్పుడు దాటవేస్తే వాళ్ళు మనం నిజంగానే తప్పు చేశాం అనుకుంటారు. అందుకే నేను ఏదో ఒకటి రాసుకోని అని వదిలేస్తాను. స్పష్టంగా విడమర్చి చెప్పింది లేదని జగపతిబాబు సమాధానం చెప్పాడు. పరోక్షంగా సౌందర్యతో నాకు ఎలాంటి ఎఫైర్ లేదని ఆయన వెల్లడించారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు