Jagan vs Chandrababu : ఇది పెత్తందార్లకు.. పేదలకు మధ్య ఫైట్ అట.. జగన్ కార్టూన్ కదిలిస్తోంది..
ఈ కార్టూన్ చూస్తే జగన్ హీరోలా కనిపిస్తున్నాడు. జనాన్ని కాపాడే దేవుడిలా ప్రొజెక్ట్ చేశారు. ఈ అద్భుతమైన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహుశా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కార్టూన్ తయారు చేసినట్టుగా కనిపిస్తోంది.

Jagan vs Chandrababu : మునుపెన్నడూ లేనంతగా వైఎస్ జగన్ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది. ఒక్కోపంచ్ ఈ మధ్యన తూటాల్లా పేలుతోంది. పాత సోషల్ మీడియా టీంను తీసేసి.. సజ్జల కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చాక చాలా క్రియేటివ్ మోడల్ లో వైసీపీ యాక్టివ్ అయ్యింది. ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణలపై ఫుల్ ఫైరింగ్ సాగుతోంది. ప్రజలను, సగటు నెటిజన్ ఆకట్టుకునేలా కట్టిపడేసేలా వీడియోలు, మీమ్స్, కార్టూన్ లతో సోషల్ మీడియాను కుమ్మేస్తున్నారు.
తాజాగా జగన్ ఏపీలోని పేదలు, ప్రజలకు అండగా ఉన్నట్టు విడుదల చేసిన ఓ కార్టూన్ వైరల్ అవుతోంది. ‘ఇది పెత్తందార్లకు.. పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం’లా కనిపిస్తోంది. ‘ఒక్కొక్కరిని కాదు బాబూ షేర్ ఖాన్.. ఒకేసారి 100 మందిని రమ్మను అంటూ’ జగన్ తొడగొట్టేస్తున్నట్టుగా కార్టూన్ ఉంది.. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇటు రామోజీరావు, రాధాకృష్ణ, టీడీపీ నేతలు, వారి అనుకూల పెట్టుబడిదారులంతా కలిసి ఏపీని దోచుకోవాలని.. ప్రజలను దోపిడీ చేయాలని చూస్తుంటే ఒకే ఒక్కడు జగన్ వారి ముందు నిలబడి అడ్డుకుంటున్నాడు. ఎవరు గీశారో.. ఎందుకు గీశారో కానీ ఈ కార్టూన్ ఇప్పుడు ఏపీలో వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. టీడీపీ అండ్ టీం దోపిడీకి కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది.
ఏపీలో చంద్రబాబు సీఎంగా అయితే అటు అమరావతి పేరు చెప్పి రైతుల భూములు కొల్లగట్టాడని వైసీపీ ఆరోపిస్తోంది. అదే థీమ్ గా తీసుకున్నారు.. రైతులకు తెలియకుండా తన టీడీపీ నేతలు, పారిశ్రామికవేత్తలకు ముందే లీక్ చేసి వారిచేత కొనిపించి దోపిడీ చేయించిన ఘనత మన చంద్రబాబుది అన్నట్టుగా ఫోకస్ చేశారు.. ప్రతీది ఇన్ సైడర్ ట్రేడింగ్ నే.. గత 40 ఇయర్స్ పాలిటిక్స్ అంటూ వ్యవస్థలన్నీ గుప్పిట పట్టి చంద్రబాబు ఆడిన ఆడుతున్న గేమ్స్ అని… ఇప్పటికీ బలమైన మీడియా, మేనేజ్ మెంట్ తో అధికార పార్టీలకే చమటలు పట్టిస్తున్నాడు మన చంద్రబాబు అంటూ ఫోకస్ అయ్యేలా కార్టూన్ గీశారు. .
ఇప్పటికీ కూడా అధికారం కోసం ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడనేలా కార్టూన్ తీర్చిదిద్దారు..పవన్ కళ్యాణ్ కు కార్టూన్ లో చంద్రబాబు పల్లకీ మోసేలా చూపించారు. ప్రజలను దోచుకోవడం.. తన సన్నిహితులు, కార్పొరేట్లకు దోచిపెట్టడమే పరమావధిగా చంద్రబాబును హైలెట్ చేశారు.
చంద్రబాబు, లోకేష్ పల్లకీ ఎక్కితే రామోజీరావు, రాధాకృష్ణ సహా పారిశ్రామివేత్తలు అంతా చంద్రబాబు పల్లకీ మోస్తూ జగన్ పై రాళ్లేస్తున్నారు. పేదలకు విద్యా, వైద్యం , సంక్షేమం పంచుతున్న జగన్ ను టార్గెట్ చేశారు. ఏపీ ప్రజలను దోచుకునేందుకు వస్తున్న చంద్రబాబు అండ్ టీంకు జగన్ ఒక్కడై ఎదురిస్తున్నాడు. ఈ కార్టూన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ కార్టూన్ చూస్తే జగన్ హీరోలా కనిపిస్తున్నాడు. జనాన్ని కాపాడే దేవుడిలా ప్రొజెక్ట్ చేశారు. ఈ అద్భుతమైన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహుశా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కార్టూన్ తయారు చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రం ఏపీ రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. జగన్ పై చంద్రబాబు సహా ఎంతోమంది ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నారని ఫోకస్ అవుతోంది.. ఏపీ ప్రజలకు మంచి చేయడమే జగన్ చేసిన తప్పా.. పేదలకు అండగా నిలుస్తున్నందుకే టీడీపీ వారు టార్గెట్ చేశారని.. టీడీపీ బారి నుంచి కాపాడుతున్నందుకే తను దెబ్బలు తింటూ జగన్ పోరాడుతున్నాడని హైలెట్ చేశారు. జనాల ముందుండి నడిపించే నాయకుడిగా జగన్ ను చూపించారు.
