Jagan-Pawan-Chandrababu: ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉన్నా అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. జగన్ ను అధికారాన్ని దూరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు పావులు కదుపుతున్నారు. పొత్తుల దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో ఆ ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి వస్తున్నారు. న్యాయమూర్తులు, అధికారుల మధ్యలో ఆ ముగ్గురూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సీఎం జగన్, పవన్ ముఖాముఖీగా ఎదురుకావడం ఇదే మొదటిసారి కాగా.. చంద్రబాబు కూడా అక్కడే ఉండడంతో ఈ సమావేశంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Jagan-Pawan-Chandrababu
రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో ఏట్ హోం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సీఎం, విపక్ష నేతతో పాటు న్యాయమూర్తులు, అధికారులు, ప్రముఖులను ఆహ్వానించారు. వారంతా తేనేటి విందుకు హాజరుకానున్నారు. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి కార్యక్రమానికి రానున్నారు. అటు చంద్రబాబు, పవన్ లకు సైతం ఆహ్వానాలు అందాయి. చంద్రబాబు గత ఏడాది అట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. నాడు ఇద్దరు నేతలు ఎదురెదురు పడలేదు. పలకరించేందుకు అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా అధికార కార్యక్రమం కావడంతో అప్పట్లో ఇద్దరు నేతలు తేనేటి విందుకే పరిమితమయ్యారు.
అయితే ఈ ఏడాది జగన్, చంద్రబాబులతో పాటు పవన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వీరు రాజకీయాల్లో దూకుడుగా ఉన్నారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇటువంటి సమయంలో ముగ్గురు నేతలు ఒకే వేదికపై రానుండడం ఉత్కంఠను పెంచుతోంది. సీఎం జగన్ ను చంద్రబాబు, పవన్ కలుస్తారా? అందుకు ఆసక్తి చూపుతారా? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి ముగ్గురు నేతలు విజయవాడలో ఉన్నారు. పవన్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్లొనున్నారు. అనంతరం నేతలతో సమావేశం కానున్నారు. గత ఏడాది అట్ హోం కార్యక్రమానికి రాజ్ భవన్ నుంచి ఆహ్వానం అందినా హాజరుకాలేదు. ఈ ఏడాది మాత్రం హాజరయ్యే చాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Jagan-Pawan-Chandrababu
చంద్రబాబు సైతం బిజీగా ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అక్కడ నుంచి రాజ్ భవన్ కు వెళ్లి అట్ హోం కార్యక్రమానికి హాజరుకానున్నారు. అటు సీఎం జగన్ షెడ్యూల్ సైతం ఖరారైంది. పవన్ విషయమే తేలాల్సి ఉంది. అయితే ముగ్గురు నేతలు ఒకే వేదికపై ఇంతవరకూ కలవలేదు. అటు జగన్, పవన్ ముఖా ముఖీ కూడా ఫస్ట్ టైమ్. దీంతో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. కలిస్తే ఏం మాట్లాడుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.