జగన్-మోడీ తెరవెనుక మంతనాలు?

జగన్ ఢిల్లీ పర్యటనపై పలురకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు ఏకరువు పెట్టినా అది కేవలం పైకి చెప్పేది మాత్రమేనని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు విషయమేంటి? ఇదే అందరికీ ఊహాగానాలకు తావిచ్చింది. ఏమయ్యుంటుందో తర్కంతో ఆలోచిస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం వుంది. ఎవరెన్నిచెప్పినా తనముందు సిబిఐ కేసులు పెట్టుకొని వాటిని ప్రస్తావించకుండా జగన్ ఉంటాడని ఎవరూ అనుకోవడంలేదు. తనేకాదు ఇప్పుడున్న రాజకీయనాయకులెవరూ అంత పవిత్రంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా ఉంటారని […]

  • Written By: Ram Katiki
  • Published On:
జగన్-మోడీ తెరవెనుక మంతనాలు?

జగన్ ఢిల్లీ పర్యటనపై పలురకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు ఏకరువు పెట్టినా అది కేవలం పైకి చెప్పేది మాత్రమేనని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు విషయమేంటి? ఇదే అందరికీ ఊహాగానాలకు తావిచ్చింది. ఏమయ్యుంటుందో తర్కంతో ఆలోచిస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
ఎవరెన్నిచెప్పినా తనముందు సిబిఐ కేసులు పెట్టుకొని వాటిని ప్రస్తావించకుండా జగన్ ఉంటాడని ఎవరూ అనుకోవడంలేదు. తనేకాదు ఇప్పుడున్న రాజకీయనాయకులెవరూ అంత పవిత్రంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా ఉంటారని వూహించలేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోత్కుపల్లి నరసింహులు కి గవర్నర్ పదవి కోసం లాబీ చేసిన సంగతి పత్రికల్లో చూసాం. దానితోపాటు ఎన్నో వ్యక్తిగత ఫేవర్లకోసం మోడీ దగ్గర లాబీ చేయటం తోటే వాళ్ళిద్దరిమధ్య దూరం మరింతపెరిగిందని చెబుతారు. మరి ఇప్పుడు జగన్ తన కేసుల గురించి ప్రస్తావించకుండా ఉంటాడని ఎలా అనుకుంటాము. రాజకీయనాయకులందరూ ఆ తాను ముక్కలే.

రెండోది, మోడీ త్వరలో కాబినెట్ విస్తరణ చేబడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయపరిస్థితుల్లో వైస్సార్సీపీ ని ఎలాగైనా ఎన్ డి ఎ లోకి లాగాలని మోడీ ప్రయత్నంచేస్తున్నాడు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇంతకుముందు ఆఫర్ చేయటం జరిగింది. అందుకు అప్పట్లో జగన్ సుముఖంగా లేడు. ఇప్పటివరకూ ఆ పదవి ఖాళీగానే వుంది. కాబట్టి అటు క్యాబినెట్ లోకి, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవికి జగన్ ని ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే జగన్ కి బీజేపీ తో చేరటంపై కొన్ని సందేహాలున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తో కలిస్తే మైనారిటీలు దూరం అవటం ఖాయం. అలాగే ప్రత్యేక హోదా పై హామీ ఇవ్వకుండా కేంద్రంలో చేరితే చంద్రబాబు నాయుడుకి , తనని వ్యతిరేకించే మీడియా కి అస్త్రం అందించినట్లవుతుందని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. కానీ అదేసమయంలో మోడీతో సఖ్యతగా లేకపోతే తన కేసులేమవుతాయోననే భయం వెన్నాడుతుంది. అందుకనే మోడీ కి ఖచ్చితంగా నో చెప్పలేని పరిస్థితి.తన అనుయాయుల్లో ముఖ్యంగా విజయసాయి రెడ్డి , మిదున్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వంలో చేరితేనే మంచిదని సలహా ఇస్తున్నట్లు తెలుస్తుంది.

తెరవెనుక ఏదో జరగకపోతే మరలా అమిత్ షా ని కలవటానికి ఎందుకు వెళుతున్నట్లు? ఈ లోపల తెలుగుదేశం కూడా కేంద్రం లో లాబీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ భయమల్లా వైస్సార్సీపీ మోడీకి దగ్గరైతే చంద్రబాబు నాయుడు వారి అనుచరులపై కక్ష సాధింపుచర్యలు ముమ్మరమవుతాయని భయం పట్టుకుంది. పైకిచెప్పే మండలి తగాదా జనానికి పూలు పెట్టటానికే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి గా పనిచేసిన వ్యక్తిని 5 రోజులు సిబిఐ విచారణ జరపటం తెలిసిందే. జగన్ కి చంద్రబాబు నాయుడు ని ఎలాగైనా బుక్ చేయాలనే కక్ష చాలా బలంగా వుంది. అదే చివరకి మోడీ కేబినెట్ లోకి చేరటానికి పుసిగొల్పచ్చని అనుకుంటున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిపై మరింత క్లారిటీ రావచ్చనేది అభిజ్ఞుల అంచనా.