Jagan On I PAC: ఐప్యాక్ ను వదిలించుకునే పనిలో జగన్.. నిజం ఎంత?
కొద్దిరోజులు కిందట ఐప్యాక్ సర్వే లీక్ అయినట్లు ఓ వార్త హల్చల్ చేసింది. వైసీపీ కేవలం మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితం కానున్నట్టు.. ఆ సర్వేలో తేలినట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో సైతం పతాక శీర్షిక వార్తలు వచ్చాయి.

Jagan On I PAC: వైసీపీకి సర్వం ఐ ప్యాకే. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ బృందం ఒక సైన్యంలా పని చేసింది. ప్రజలను వర్గ వైషమ్యాలతో విడగొట్టి వైసిపి వైపు టర్న్ చేసింది. ఖచ్చితమైన సర్వేలు, నివేదికలతో గెలుపు బాట పట్టించింది. అందుకే జగన్ కు ఐపాక్ అంటే అపారమైన నమ్మకం. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం రాజకీయ వ్యూహకర్త గా లేకున్నా.. ఆయన సేవలు మాత్రం వైసీపీకి కొనసాగుతున్నాయి. అయితే మునపటిలా ఐపాక్ టీం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతుందన్న టాక్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఐపాక్ టీం ఎక్కడా బయటపడకుండా తన పని తాను చేసుకునేది. గోప్యత పాటించేది. సర్వేలు, నివేదికలు బహిర్గతమయ్యేవి కాదు. సలహాలు, సూచనలు,పార్టీలో మార్పులు, అంతర్గత విషయాలు, టికెట్ల కేటాయింపు ఇలా అన్ని అంశాలపై తమ సూచనలను నేరుగా వైసిపి హై కమాండ్కే అందించేవి.కానీ ప్రస్తుతం ఐపాక్ టీం పనితీరుపై జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఐపాక్ ను వదిలించుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కొద్దిరోజులు కిందట ఐప్యాక్ సర్వే లీక్ అయినట్లు ఓ వార్త హల్చల్ చేసింది. వైసీపీ కేవలం మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితం కానున్నట్టు.. ఆ సర్వేలో తేలినట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో సైతం పతాక శీర్షిక వార్తలు వచ్చాయి. దీంతో జగన్ అసహనం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఐ ప్యాక్ బృందం కావలిసే లీక్ చేసిందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.అదే సమయంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను కలిశారని ఒక వార్త బయటకు వచ్చింది. దీనికి మమతా బెనర్జీ మధ్యవర్తిత్వం వహించారని ప్రచారం జరిగింది. అంతకుముందే లోకేష్ సైతం పీకే ను కలిసినట్లు వార్తలు హల్చల్ చేశాయి. దీంతో జగన్లో మరింత అనుమానం పెరిగినట్లు టాక్ నడుస్తోంది.
అయితే ఐపాక్ సర్వే లీకంటూ చాలా రోజులుగానే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ఐ ప్యాక్ స్పందించడం విశేషం. తాము ఎలాంటి సర్వే చేపట్టలేదని.. బయట జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న కథనాలు తప్పని ఐ ప్యాక్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే ఎప్పుడో జరిగిన ప్రచారానికి ఇప్పుడు ఖండిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఐపాక్ ను వదిలించుకునే పనిలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి మరి.
