CM Jagan- AP Capital Issue: అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేల్చడానికి రెడీ అయిన జగన్

CM Jagan- AP Capital Issue: జగన్ అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయి. అసలు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయన పక్కనున్నవారికి.. ప్రత్యర్థులకు కూడా తెలియడం లేదు. సడెన్ గా నిర్ణయాలు చేస్తూ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీ రాజధానిపై జగన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేల్చడానికి రెడీ అవుతున్నారు. అసలు జగన్ వేస్తున్నప్లాన్ ఏంటి? వైసీపీలో ఏం జరుగుతుందన్న దానిపై స్పెషల్ ఫోకస్ అమరావతి […]

CM Jagan- AP Capital Issue: అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేల్చడానికి రెడీ అయిన జగన్
CM Jagan- AP Capital Issue

CM Jagan- AP Capital Issue

CM Jagan- AP Capital Issue: జగన్ అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయి. అసలు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయన పక్కనున్నవారికి.. ప్రత్యర్థులకు కూడా తెలియడం లేదు. సడెన్ గా నిర్ణయాలు చేస్తూ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీ రాజధానిపై జగన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేల్చడానికి రెడీ అవుతున్నారు. అసలు జగన్ వేస్తున్నప్లాన్ ఏంటి? వైసీపీలో ఏం జరుగుతుందన్న దానిపై స్పెషల్ ఫోకస్

అమరావతి అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. తక్షణ పరిశీలన జాబితాలో ఉంచి త్వరగా తేల్చాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరుతున్నారు. ఆ మేరకు ఈ నెల 28న తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశతో ఉన్నారు. ఒకవేళ తీర్పు వెల్లడయినా, వాయిదా పడినా కోర్టుతో పనిలేకుండా స్వంతంగా నిర్ణయం తీసుకొని పరిపాలన చేపట్టాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 17 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గత ఏడాది రూ.2,56,256 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023-24 బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన గవర్నర్
అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయనకు ఇదే అసెంబ్లీలో తొలి ప్రసంగం.

కాగా, వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి సంక్షేమ పథకాల వెచ్చించిన నిధులు, చేపట్టబోయే పనులకు సంబంధించిన ఆదాయం, రాబడులను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 28, 29 తేదీల్లో జీ20 సదస్సును విశాఖలోనే చేపట్టనున్నారు.

CM Jagan- AP Capital Issue

CM Jagan- AP Capital Issue

వైసీపీ అధికారం చేపట్టిన తరువాత రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా మార్చిన జగన్, ఒక స్పష్టత తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని ఫైనల్ చేసుకొని అసెంబ్లీ వేదికగా దాంతో 27వ తేదీలోపు సమావేశాలను ముగింంచాలని భావిస్తున్నారు. ఇదే రోజు విశాఖ నుంచే పాలన విషయాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

అయితే, అమరావతి నుంచే పరిపాలన చేపట్టాలని పట్టబడుతున్న విపక్షాలు మరింత ఆందోళనలకు దిగే అవకాశం లేకపోలేదు. ఈ నిరసనలను వైసీపీ ప్రభుత్వ అనుకూలంగా మలుచుకునేందుకు ప్రణాళికలు రచించే అవకాశం లేకపోలేదు.

Tags

    Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
    oktelugu whatsapp channel
    follow us
    • facebook
    • instagram
    • twitter
    • youtube