Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కొత్త ఐపీఎల్ టీంని తయారు చేయబోతున్న జగన్..? వైరల్ అవుతున్న రోజా కామెంట్స్
రోజా స్పందిస్తూ ‘చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టు తీసుకొని , మనకంటూ ఒక టీం ని సిద్ధం చెయ్యాలి అని జగన్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే కచ్చితంగా చేసి తీరుతాడు’ అంటూ చెప్పుకొచ్చింది రోజా.

Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత ఆసక్తికరంగా సాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ పార్టీ మధ్య జరుగుతున్నా పొలిటికల్ వార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరువురి పార్టీల నేతలు మరియు కార్యకర్తలు రాష్ట్రం లో ధర్నాలు మరియు ర్యాలీలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ఎమ్యెల్యే రోజా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వాలంటీర్ వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనని తీవ్రం గా తప్పుబట్టింది. ముఖ్యంగా ఉమన్ ట్రాఫికింగ్ గురించి ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నా ఉమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడావు, మరి తెలంగాణ ప్రాంతం లో జరుగుతున్న ఉమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడగలవా, అక్కడ మాట్లాడితే కేసీఆర్ నీ మక్కెలు విరగ్గొడతాడు, అంటూ చెప్పుకొచ్చింది రోజా.
ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు, సోషల్ మీడియా లో రోజా ని ట్యాగ్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రముఖ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రీసెంట్ గానే వైసీపీ పార్టీ లో చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే.
దీనిపై రోజా స్పందిస్తూ ‘చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టు తీసుకొని , మనకంటూ ఒక టీం ని సిద్ధం చెయ్యాలి అని జగన్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే కచ్చితంగా చేసి తీరుతాడు’ అంటూ చెప్పుకొచ్చింది రోజా. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆంధ్ర ప్రదేశ్ లో రాజధానికే దిక్కు లేదు కానీ, ఐపీఎల్ టీం ని తయారు చేస్తాడట అంటూ వెక్కిరిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
