Jagan Vs Pawan Kalyan: పవన్, చంద్రబాబుల ‘స్థానికత’పై కొట్టిన జగన్
జగన్ ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నారు. చంద్రబాబు, పవన్ లు ఇద్దరూ స్థానికేతరులుగా అభివర్ణించారు. ఆ ఇద్దరిది హైదరాబాద్ పొరుగు రాష్ట్రంగా చెప్పుకొచ్చారు.

Jagan Vs Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు హీటెక్కతున్నాయి, ఏడాది ముందే కాక రేపుతున్నాయి. పొత్తులు తప్పవని పవన్ సంకేతం ఇచ్చిన వేళ ప్రత్యర్థులకు ఆయనే టార్గెట్ అవుతున్నారు.వైసీపీ విముక్త ఏపీ కోసమే తాను కృషిచేస్తున్నట్టు పవన్ ప్రకటించడంతో సహజంగానే టార్గెట్ చేస్తారు. వైసీపీ ముఖ్య నేతలు, మంత్రులు ఇలా అందరూ పవన్ పై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సైతం అదే స్థాయిలో విమర్శలు కురిపించారు. బాపట్ల జిల్లాలో మత్స్యకారభరోసా పంపిణీకి శ్రీకారంచుట్టిన జగన్ జనసేనాని పవన్ పేరు ఎత్తకుండానే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ పై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గతంలో చంద్రబాబు, పవన్..ఇలా ఇద్దరిపై దాడిచేసే జగన్ ..ఇప్పుడు మాత్రం పవన్ చర్యలను తప్పుపడుతూ కామెంట్స్ చేయడం విశేషం.
జగన్ ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నారు. చంద్రబాబు, పవన్ లు ఇద్దరూ స్థానికేతరులుగా అభివర్ణించారు. ఆ ఇద్దరిది హైదరాబాద్ పొరుగు రాష్ట్రంగా చెప్పుకొచ్చారు. వారిద్దరూ గెలిస్తే అమరావతి అంటారు.. లేకుంటే హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అని చెబుతారని ఎద్దేవా చేశారు. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. షూటింగ్ లకు గ్యాప్ వచ్చినప్పుడు బయటకు వచ్చి నాలుగు విమర్శలు చేసి పోతాడని.. అదంతా బాబు స్క్రిప్టేనని విమర్శించారు. ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు అంటూ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. తీవ్ర అసహనంతో మాట్లాడినట్టు కనిపించారు.
తాను ప్రజల గురించి ఆలోచిస్తుంటే.. చంద్రబాబు, పవన్ లు మాత్రం పొత్తుల గురించి ఆలోచిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.ఒకసారి విడిపోదామని బాబు చెబుతారు మరోసారి కలసి పోటీ చేద్దామని అంటారు. ఆ రెండింటికీ తలూపుతూ చిత్తం ప్రభూ అనడమే దత్త పుత్రుడికి తెలిసిన విద్య అదే ఆయన రాజకీయమని పూర్తిగా టార్గెట్ చేశారు జగన్. ప్యాజేకీ కోసం దత్తపుత్రుడు ఎన్ని వేషాలు వేయమన్నా వేస్తాడని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్ప ప్రజల గురించి పవన్ కి పట్టదని కూడా కౌంటరేశారు. ఏపీ ఎలా ఉంటే మాకేమి మేముండేది పరాయి చోట…మాకు కావాల్సింది అధికారం… దాని కోసం ఏమేమి చేయాలో అవే చేస్తామని బాబు పవన్ డిసైడ్ అయినట్టున్నారని సెటైర్లు వేశారు. బాబు ఏమి చెబితే అలా చిత్తం అనడమే పవన్ కర్తవ్యం అంటూ పవర్ స్టార్ గాలి తీసే ప్రయత్నం చేశారు. జగన్ తాజా కామెంట్స్ పై టీడీపీ, జనసేనల నుంచి ఏ స్థాయిలో రియాక్షన్ ఉంటుందో చూడాలి మరీ.
