CM YS Jagan Vs Chandrababu Naidu : బాబును విలన్ చేసేందుకు జగన్ ఆరాటం

ఈ సవాళ్లను అమరావతి ఎప్పుడో అధిగమించింది. కానీ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని జగన్ సర్కారు కడప జిల్లా కొప్పర్తిని ఎంపిక చేసింది. పేదలకు  ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పనికొచ్చిన అమరావతి.. నగరీకరణకు పనికి రాదా అన్న కొత్త వాదన సైతం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశాన్నే ఆ రెండు పార్టీలు హైలెట్ చేయనున్నాయి. అదే జరిగితే జగన్ చెబుతున్న క్లాస్ వార్ కు అమరావతి నగర ఇష్యూ గట్టి సవాల్ విసిరే అవకాశముంది.  

  • Written By: Dharma Raj
  • Published On:
CM YS Jagan Vs Chandrababu Naidu : బాబును విలన్ చేసేందుకు జగన్ ఆరాటం

CM YS Jagan Vs Chandrababu Naidu : పాలనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్ట్రాటజీ. చంద్రబాబు ఇండస్ట్రీ, టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చారు. అవకాశం దొరికితే ఆ రంగాన్ని డెవలప్ చేయాలని చూశారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ వర్గాల్లో  దేవుడు అనిపించుకున్నారు. అయితే ఈ క్రమంలో దాదాపు పాలనఅంతా ఒక్కటే. కానీ నిర్ణయాలే భిన్నంగా ఉంటాయి. అయితే చంద్రబాబు అనేటప్పుడు హైటెక్ బాబు అని ముద్ర పడిపోయారు. సంక్షేమ పథకాల ఆధ్యుడిగా రాజశేఖర్ రెడ్డి మారిపోయారు. సమాజంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు మెజార్టీ వర్గాలు కాబట్టి ఆయనకు దేవుడిగా కొలిచారు. హైటెక్ వర్గాలు కమర్షియల్ కాబట్టి చంద్రబాబు ఆ వర్గంగా ముద్రపడిపోయారు.

ఇప్పుడు జగన్ దానినే గుర్తించి క్లాస్ వార్ అన్న మాటను బయటకు తీశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని.. పెత్తందార్లకు కొమ్ముకాస్తున్నారన్న స్లోగన్స్ అందుకున్నారు.
వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ జ‌రుగుతోంద‌ని విమ‌ర్శించ‌డానికి బ‌ల‌మైన రాజ‌కీయ కార‌ణం వుంది. టీడీపీని, జ‌న‌సేన‌ను పేద‌ల శ‌త్రువులుగా చూపే క్ర‌మంలో జ‌గ‌న్ డైలాగ్ వార్‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ పైచేయి సాధించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  భారీ మొత్తంలో రాజ‌ధాని ప్రాంతంలో పేద‌ల‌కు నివాస స్థలాల పంపిణీతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో విపక్షాల ఓటమికే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని భావిస్తున్నారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఒకవైపు.. రాష్ట్ర ప్రభుత్వ బాధిత వర్గాలు, వ్యతిరేక వర్గాలు మరోవైపు ఉన్నట్టు జగన్ భావిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను తనవైపు తిప్పికొవడానికి చంద్రబాబును బూచిగా చూపిస్తున్నారు. ఆయన పేదల వ్యతిరేకిగా క్రియేట్ చేసేందుకే కొత్త ఎత్తుగడగా విశ్లేషకులు అభిప్రకాయపడుతున్నారు. బాబు అంటే సంప‌న్న‌వ‌ర్గాల ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేసే పొలిటీషియ‌న్‌గా చూపించేందుకు జగన్ తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకు రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఇళ్ల స్థ‌లాల పంపిణీలో చోటు చేసుకున్న ప‌రిణామాలే నిద‌ర్శ‌నం. మంగ‌ళ‌గిరి, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 1,402 ఎక‌రాల్లో 25 లేఔట్ల‌లో 50,793 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంచారు. దీనిని క్లాస్ వార్ గా చూపించేందుకు జగన్ ఆరాటపడుతున్నారు.

అయితే దీనిని తిప్పికొట్టేందుకు టీడీపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయి. అది రైతుల నుంచి సేకరించిన భూమి. ఒక వైపు రాజధాని ఇష్యూ కోర్టు లో పెండింగ్ లో ఉండగా.. చేస్తున్న చర్య ఇది.  మరోవైపు ఇదే వైసీపీ సర్కారు అమరావతిని శాసన రాజధానిగా గుర్తించింది. మూడు రాజధానుల నగరాల్లో ఇదొకటి అని చెప్పుకొచ్చింది. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ నుంచి ప్రతిపాదనలు కోరింది. దీంతో అంతా అమరావతిని సూచిస్తారని భావించారు. ఇప్పటికే ఇక్కడ భూ సేకరణ పూర్తికావడం, రహదారులు వంటి మౌలిక వసతులు కారణంగా ఎంపికకు అన్నివిధాలా శ్రేయస్కరం కూడా. కొత్త నగరాల ఏర్పాటులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక సంఘం భావించింది. అయితే ఈ సవాళ్లను అమరావతి ఎప్పుడో అధిగమించింది. కానీ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని జగన్ సర్కారు కడప జిల్లా కొప్పర్తిని ఎంపిక చేసింది. పేదలకు  ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పనికొచ్చిన అమరావతి.. నగరీకరణకు పనికి రాదా అన్న కొత్త వాదన సైతం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశాన్నే ఆ రెండు పార్టీలు హైలెట్ చేయనున్నాయి. అదే జరిగితే జగన్ చెబుతున్న క్లాస్ వార్ కు అమరావతి నగర ఇష్యూ గట్టి సవాల్ విసిరే అవకాశముంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు