తెలంగాణ సీఎం కెసిఆర్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది వాడుకొని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు. జగన్-కెసిఆర్ లు మంచి స్నేహితులని అందరూ అనుకుంటున్నారు కానీ జగన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలిని, కెసిఆర్ కి ఎవరూ స్నేహితులు ఉండరని, ఆయన తన అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారని అన్నారు. కమిషన్ల కోసమే కెసిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లింక్ ప్రాజెక్టులు కడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధికోసం సందర్భానుసారంగా అందర్నీ వాడుకుంటారని వెంకట స్వామి అన్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రలు పోషించిన కొంతమందిని కెసిఆర్ వాడుకొని, తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వారిని వదిలేసి, కొత్త వారితో జత కట్టి ఉద్యమ కారులకు తీవ్ర అన్యాయం చేశారని వెంకట్ స్వామి ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వివేక్ వెంకట స్వామి. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు.