అలీకి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్?
ప్రముఖ సినీనటుడు అలీకి ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అలీకి నిరాశే మిగిలింది. దింతో ఈ సారి ఆయనకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ సీటు దక్కించుకోబోయే వైసీపీ నేతలు ఎవరనే దానిపై ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో… ఆశావాహుల్లోనే టెన్షన్ పెరిగిపోతోంది. నాలుగు […]

ప్రముఖ సినీనటుడు అలీకి ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అలీకి నిరాశే మిగిలింది. దింతో ఈ సారి ఆయనకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.
రాజ్యసభ సీటు దక్కించుకోబోయే వైసీపీ నేతలు ఎవరనే దానిపై ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో… ఆశావాహుల్లోనే టెన్షన్ పెరిగిపోతోంది. నాలుగు సీట్లను నాలుగు సామాజికవర్గాలకు కేటాయించాలని భావించిన సీఎం జగన్… తాజాగా ఒక సీటుని సిట్టింగ్ ఎంపీకి, మరో సీట్ అలీకి కేటాయించాలని నిర్ణయించుకున్నారనే వార్తలు ఆ పార్టీలో మరింత టెన్షన్ వాతావరణాన్ని పెంచింది.
అయితే మైనార్టీ కోటాలో ఒకరికి కచ్చితంగా ఛాన్స్ ఉంటుందనే ప్రచారం వైసీపీలోని ఆ వర్గం నేతల్లో ఆశలు పెంచుతోంది. అదే సమయంలో మైనార్టీ కోటా పరంగా చూసుకున్నా.. అలీకి ఒక సీట్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీలో అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు. కొందరు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.కాబట్టి మైనార్టీ కోటాలో అలీకి పెద్దల సభ సీటు దక్కుతుందో లేదో తెలియాలంటే ఇంకొంత సమయం వేచిచూడాలి.