Jagan- IPAC: ఆ ఓటమిని ఐ ప్యాక్ కు ఆపాదించిన జగన్.. వైసీపీ శ్రేణులు ఖుషీ

Jagan- IPAC: ఏదైనా కష్టం వస్తే నా గురించి నా స్నేహితులతో మాట్లాడతారు. నాతో మాట్లాడండి నాన్న.. బొమ్మరిల్లు సినిమాలో ఓ కుమారుడు తన తండ్రి వద్ద వ్యక్తం చేసే బాధ ఇది. ఇప్పుడు సేమ్ సిట్యువేషన్ ఏపీలో ఉంది. తండ్రి స్థానంలో ఏపీ సీఎం జగన్ ఉండగా.. కుమారుడి స్థానంలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. స్నేహితుల స్థానంలో ఐ ప్యాక్ బృందం ఉంది. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటమి ఎదురైతే […]

  • Written By: Dharma Raj
  • Published On:
Jagan- IPAC: ఆ ఓటమిని ఐ ప్యాక్ కు ఆపాదించిన జగన్.. వైసీపీ శ్రేణులు ఖుషీ

Jagan- IPAC: ఏదైనా కష్టం వస్తే నా గురించి నా స్నేహితులతో మాట్లాడతారు. నాతో మాట్లాడండి నాన్న.. బొమ్మరిల్లు సినిమాలో ఓ కుమారుడు తన తండ్రి వద్ద వ్యక్తం చేసే బాధ ఇది. ఇప్పుడు సేమ్ సిట్యువేషన్ ఏపీలో ఉంది. తండ్రి స్థానంలో ఏపీ సీఎం జగన్ ఉండగా.. కుమారుడి స్థానంలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. స్నేహితుల స్థానంలో ఐ ప్యాక్ బృందం ఉంది. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటమి ఎదురైతే జగన్ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అది వైసీపీ శ్రేణులతో కాదు. వారికంటే ఎక్కువగా భావించే ఐ ప్యాక్ టీమ్ తో ఓటమిపై చర్చించారు. అసలు ఎందుకు ఓటమి ఎదురైందని నిలదీసినంత పనిచేశారు. అన్ని పార్టీలు మాదిరిగానే వైసీపీ కూడా ఒక పార్టీ. నాయకుడు, కేడర్ ఉంటుంది. కానీ అసలు వారి అవసరమే లేనట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. తన బొమ్మ ఉండి ఐ ప్యాక్ టీమ్ ఉంటే చాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.

2014 ఎన్నికల్లో విజయం దక్కకపోవడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అప్పటికే హేమాహేమీలను బయటపడేసిన ప్రశాంత్ కిశోర్ ను పట్టుకున్నారు. తన రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విషం చిమ్మించడం, జగన్ నాయకత్వంపై ప్రజలు టర్న్ అయ్యేలా చేయడంలో పీకే సక్సెస్ అయ్యారు. జగన్ కు అంతులేని విజయాన్నికట్టబెట్టారు. అటు తరవాత వచ్చిన అన్ని ఎన్నికల్లో జగన్ పీకే టీమ్ పై బాధ్యతలు పెట్టారు. అన్నింటిలోనూ గెలుపొందారు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కనుక, ప్రజాగ్రహానికి గురైనప్పుడు వ్యూహకర్తలతో పనిలేదన్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. అయితే ఎన్నికల తరువాత పార్టీ శ్రేణులతో జగన్ మీటింగ్ పెడతారని భావిస్తే… ఆయన ఐ ప్యాక్ టీమ్ తో సమావేశం కావడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే గతానికి భిన్నంగా ఐ ప్యాక్ టీమ్ పై జగన్ రుసరుసలాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయం ఐ ప్యాక్ టీమే లీకు చేసింది. మీరు చెప్పిందేమిటి? చేసిందేమిటి? మిమ్మల్ని నమ్ముకుంటే వచ్చే సాధారణ ఎన్నికలకు ఎలా వెళతాను అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఐ ప్యాక్ టీమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అయితే కోట్లకు కోట్ల వేతనాలు తీసుకోవడంతో వారు భరించక తప్పలేదు. ఉపాధ్యాయ స్థానంలో ప్రమాదాన్ని ముందే చెప్పారని.. అందుకే అక్కడ ప్రైవేటు టీచర్ల ఓట్లతో నష్టాన్ని భర్తీ చేసుకున్నామని.,,మరి పట్టభద్రుల విషయంలో ఎందుకు అప్రమత్తం చేయలేదని జగన్ నిలదీసినట్టు సమాచారం. ఇంత చిన్న ఎన్నికను మేనేజ్ చేయలేకపోతే.. రేపు సాధారణ ఎన్నికల్లో ఏంచేస్తారో అని జగన్ నిలదీయడంతో ఐ ప్యాక్ బృందం సభ్యులు మల్లుగుల్లాలు పడినట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ ఐ ప్యాక్ టీమ్ ఆధిపత్యాన్ని సహించలేని వైసీపీ శ్రేణులు మాత్రం లోలోపల ఆనందపడుతున్నాయి.

Jagan- IPAC

Jagan- IPAC

అయితే గెలిస్తే తమ క్రెడిట్.. ఓడిపోతే తమది కానట్టు ఐ ప్యాక్ టీమ్ వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రులు ఆగ్రహంలో ఉన్నారని, వారిని ఆకట్టుకునేందుకు ఏదోటి చేయాలన్న ఆలోచన ఐప్యాక్ టీం రాకపోవడం పెద్ద మైనస్. దీనిపై అప్రమత్తం చేయకపోవడం వల్లే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వైసీపీనేతలు భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచే స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయడంలో ఐప్యాక్ ఫ్లాపైందని చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లు విజయం ముసుగులో ఐ ప్యాక్ ను తలకెక్కించుకున్న జగన్ కు ఇప్పుడు అసలు విషయం తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలు తప్పితే, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారని జగన్ ప్రశ్నించడంతో అటు ఐ ప్యాక్ సభ్యులకు నోట మాట రావడంలేదు. అదే సమయంలో ఎమ్మెల్సీ విజయాలను టీడీపీ సోషల్ మీడియా పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. రాష్ట్రం నలుమూలలా వైసీపీ పనైపోయిందని ప్రచారం చేస్తోంది. దీనికి వైసీపీ సోషల్ మీడియా సైతం కౌంటర్ ఇవ్వలేకపోతోంది.

సంబంధిత వార్తలు