Jabardasth Varsha: ఒక్క నిర్ణయం వర్ష జీవితాన్ని మార్చేసింది. బుల్లితెర స్టార్ ని చేసింది. ప్రస్తుతం వర్షకు బుల్లితెర ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆమె గ్లామర్ వాళ్ళను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. చాలా కాలంగా వర్ష సీరియల్స్ లో నటిస్తున్నారు. అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కావడంతో ఆమెకు ఎలాంటి ఇమేజ్ రాలేదు. అత్తెసరు సంపాదనతో నెట్టుకొస్తున్న వర్ష… జబర్దస్త్ కి వచ్చారు.

Jabardasth Varsha
జబర్దస్త్ షోలో వర్ష సూపర్ సక్సెస్ అయ్యారు. చాలా తక్కువ సమయంలో ఫేమస్ అయ్యారు. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన ఆడియన్స్ కి వర్ష అందాలు సరికొత్త అనుభూతిని పంచాయి. మిల్కీ వైట్, స్లిమ్ ఫిగర్ చూసి ఫిదా అయ్యారు. ఒక్క దెబ్బతో ఫ్యాన్స్ అయిపోయారు.
వర్షకు ఫేమ్ తెచ్చిన మరొక అంశం ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్. జబర్దస్త్ వేదికగా ఇమ్మానియల్, వర్ష లవ్ బర్డ్స్ గా అవతరించారు. నల్లబ్బాయి వెనుకబడే తెల్లమ్మాయిగా ఈ ఫెయిర్ కొంచెం భిన్నంగా తోచింది ప్రేక్షకులకు. ఇమ్మానియేల్ ని వర్ష తనకు దొరికిన అదృష్టం అంటుంది. జీవితంలో అతన్ని వదిలేది లేదంటుంది. ఇటీవల వర్ష మెడలో తాళి కూడా కట్టించుకుంది.

Jabardasth Varsha
ఇమ్మానియేల్-వర్ష రొమాన్స్, కెమిస్ట్రీ ఆడియన్స్ కి నచ్చడంతో వారిపై స్పెషల్ స్కిట్స్ రూపొందిస్తున్నారు. మెల్లగా బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా వర్ష ఫేమ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో వర్ష సందడి చేస్తున్నారు. అలాగే పలు స్పెషల్ ఈవెంట్స్ లో భాగం అవుతున్నారు. ఇక ఇమ్మానియేల్ ని వర్ష నిజంగా ప్రేమిస్తున్నారా? లేక సెన్సేషన్ కోసం చేస్తున్న డ్రామానా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. తాజాగా బ్యాక్ లెస్ జాకెట్, సిల్క్ శారీ ధరించి టెంప్టింగ్ హాట్ ఫోజుల్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. వర్ష భుజం పై ఉన్న అందమైన టాటూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. వర్ష లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.