Kevvu Karthik Marriage: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ వివాహం… అమ్మాయి ఎవరంటే?
కెవ్వు కార్తీక్ కోటు సూటు వేసి సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అమ్మాయి కెవ్వు కార్తీక్ బట్టలకు మ్యాచ్ అయ్యేలా నీలి రంగు ఫ్రాక్ లో మెరిసింది. అమ్మాయి ముఖాన్ని కార్తీక్ రివీల్ చేయలేదు.

Kevvu Karthik Marriage: జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకరు. చాలా కాలంగా ఇతడు జబర్దస్త్ లో ఉన్నారు. టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చి లీడర్ స్థాయికి ఎదిగాడు. నాగార్జునను కెవ్వు కార్తీక్ గొప్పగా ఇమిటేట్ చేస్తాడు. కెవ్వు కార్తీక్ కి కూడా బుల్లితెర ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంది. కాగా ఈ యంగ్ ఫెలో పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు. ఒక అమ్మాయితో రొమాంటిక్ గా ఉన్న ఫోటోలు కార్తీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కెవ్వు కార్తీక్ కోటు సూటు వేసి సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అమ్మాయి కెవ్వు కార్తీక్ బట్టలకు మ్యాచ్ అయ్యేలా నీలి రంగు ఫ్రాక్ లో మెరిసింది. అమ్మాయి ముఖాన్ని కార్తీక్ రివీల్ చేయలేదు. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ లా ఉంది. ఆ ఫోటోలకు కార్తీక్ ఇచ్చిన క్యాప్షన్ తో పూర్తి క్లారిటీ వచ్చేసింది. కొందరి రాక జీవితాన్ని మరింత ఆనందమయంగా మార్చేస్తుందని కొందరు అంటుంటారు. అది ఇదే కావచ్చు. థాంక్ యూ బ్యూటిఫుల్ నా జీవితంలోకి వచ్చినందుకు అని కామెంట్ పెట్టాడు.
దాంతో కెవ్వు కార్తీక్ వివాహం చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చాడని పలువురు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అమ్మాయి ఎవరు? ఇది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. కెవ్వు కార్తీక్ అమ్మాయితో ఉన్న రొమాంటిక్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
కెవ్వు కార్తీక్ మిమిక్రీ ఆర్టిస్ట్. కెరీర్ బిగినింగ్ లో అనేక కష్టాలు పడ్డాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా అనేక షోలు చేశాడు. అయితే అతడి దశ జబర్దస్త్ మార్చేసింది. జబర్దస్త్ కి వచ్చిన కెవ్వు కార్తీక్ అంచలంచెలుగా ఎదిగాడు. టీమ్ లీడర్ అయ్యాడు. ముక్కు అవినాష్ తో కలిసి కార్తీక్ టీమ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్ లో లేదు. దీంతో కెవ్వు కార్తీక్ సోలోగా చేస్తున్నాడు. కెవ్వు కార్తీక్ తన సంపాదనతో నన్ను బ్రతికించాడని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ అమ్మ పలుమార్లు చెప్పి ఎమోషనల్ అయ్యారు.
